విలాసవంతమైన వస్తువుల్ని అమ్మే కంపెనీలు బేసిక్ ప్రైస్ ని మాత్రం మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండేలా చూస్తాయి. ఆ తర్వాత తం లగ్జరీ ప్రోడక్స్ ప్రైస్ ని మాత్రం ఆకాశంలో నిలబెడతాయి. కార్లకు కూడా ఇది మినహాయింపేమీ కాదు. లగ్జరీ బ్రాండ్ల బేసిక్ మోడల్స్ రేట్లు కాస్త రీజనబుల్ గానే ఉంటాయి. కానీ భారత్ లో అడుగు పెట్టిన టెస్లా మాత్రం తన బేసిక్ కార్ రేటుని సామాన్యులకు ఏమాత్రం అందనంత దూరంలో ఉంచింది. లగ్జరీ కార్లలో ప్రయాణించే కొంతమంది కూడా ఈ రేటు చూసి షాకవుతున్నారు. ఎంచక్కా ఆ రేటుకి రెండు మూడు ప్లాట్లు కొనేయొచ్చని జోక్ చేస్తున్నారు.
American company 'Tesla' has officially entered the Indian market with the launch of its Model 'Y' electric vehicle, as the company opens its first showroom in Mumbai today.
Maharashtra CM @Dev_Fadnavis attended the inauguration ceremony and invited Tesla to establish its… pic.twitter.com/Nry6xmlqLF
— All India Radio News (@airnewsalerts) July 15, 2025
టెస్లా ప్రారంభ ధర..
టెస్లా బేస్ మోడల్ ధర అమెరికాలో 44,990 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.38.63 లక్షలు
చైనాలో టెస్లా బేస్ మోడల్ ధర 2,63,500 యువాన్లు. అంటే మన కరెన్సీలో రూ.31.57 లక్షలు. చైనాలో తయారీ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ధర కాస్త తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.
ఇక జర్మనీలో టెస్లా బేసిక్ మోడల్ ధర రూ.46 లక్షలుగా ఉంది. అయితే భారత్ విషయానికొచ్చేసరికి ఈ రేటులో చాలా వ్యత్యాసం ఉంది. టెస్లా బేసిక్ కార్ ని మోడల్ ‘Y’ గా పిలుస్తున్నారు. దీని ధర భారత్ లో రూ.61.07 లక్షలు. అంటే ఇతర దేశాలకంటే భారత్ లో దానిరేటు చాలా ఎక్కువ. ఎక్కువ అనేది ఊహించిందే అయినా మరీ ఎంత ఎక్కువా అని టెస్లా కొనాలని అనుకున్నవారు ముక్కున వేలేసుకుంటున్నారు. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చులతో కలిపి టెస్లా రేటు భారత్ లో భారీగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.
ముందు ముంబై, ఆ తర్వాతే ఢిల్లీ..
టెస్లా సంస్థ భారత్ లో తన తొలి షోరూమ్ ని ముంబైలో ఈరోజు ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్‌లో ఈ షోరూమ్ ఉంది. 4వేల చదరపు అడుగుల భారీ ప్రాంగణంలో ఈ షోరూమ్ ని ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల క్రితం ముంబై-పుణె హైవేపై ఈ వాహనాన్ని టెస్ట్ డ్రైవే చేశారు. ఇప్పుడు ఈ మోడల్ ని షోరూమ్ లో ఉంచారు. దీనికి జునిపెర్ అనే కోడ్ నేమ్ పెట్టారు. ఈ నెలాఖరులో ఢిల్లీలో కూడా షోరూమ్ ఓపెన్ చేస్తారు.
ఫీచర్లు..
– ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500-600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
– కేవలం 4.6 సెకన్లలోనే గంటకు 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనే సామర్థ్యం దీనికి ఉంది.
– గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు.
– 15.4 అంగుళాల భారీ టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇందులో ఉంటుంది.
– వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉందులో ఉన్నాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెస్లా మార్కెట్ డల్ గా ఉంది. ఈ ఏడాది రెండు క్వార్టర్లలో టెస్లా అమ్మకాలు తగ్గాయి. భారత్ లో అడుగుపెట్టడానికి ఇప్పుడు టెస్లా సిద్ధపడటంతో కొత్త మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.