E-Paper
Advertisement

టాక్సిక్ అప్పుడే చేతులెత్తేసిందా?

టాక్సిక్ అప్పుడే చేతులెత్తేసిందా?
Advertisement

Toxic Box Office:గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన టాక్సిక్ సినిమా ఆగస్ట్ 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి తెల్సిందే.ఇక kgf 2 వంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం,నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, హ్యూమా కురేషీ, రుక్మిణీ వసంత్ వంటి ఫ్యాన్ ఇండియా స్టార్స్ అంతా బరిలోకి దిగుతుండటం,ఇక kvn కూడా బడ్జెట్ ని వరద నీళ్ళలా పారించామని ఊదరగొట్టడం, పైగా సినిమాలో మోతాదుకి మించిన అడల్ట్ కంటెంట్ ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అయుపోవడంలో అంచనాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళిపోయాయి.

ఇక అనుకున్నట్టుగానే రాకింగ్ స్టార్ యష్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజే రూ.105 కోట్ల నెట్ ని సొంతం చేసుకుని మొదటి రోజే తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.కాని సినిమా రిజల్ట్ ఏంటో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. థియేటర్ లలో చూస్తున్న ఆడియన్స్ కి అర్థం అయిపొయింది,అనుకున్న సినిమా ఒకటైతే వస్తున్న సినిమా మరొకటి అని.

రెండో రోజు కేవలం

Advertisement

ఇంకేం.. కట్ చేస్తే రెండో రోజు బాక్సాఫీస్ వద్ద ఊహించని దారుణమైన ఫలితాలని మూటగట్టుకుంటుంది.మొదటి రోజు ఈజీగా సెంచరీ కొట్టేసిన యష్ రెండో రోజు కేవలం 37కోట్ల వద్దే ఆగిపోయాడు. అంటే మొదటి రోజుతో పోలిస్తే దాదాపు 65 శాతం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.అంటే రెండు రోజుల్లో టాక్సిక్ కొల్లగొట్టిన నెట్ అక్షరాల 142 కోట్లు అన్నమాట. ఇక గ్రాస్ పరంగా ఈ సినిమా కొల్లగొట్టింది కేవలం 195 కోట్ల పై చిలుకు మాత్రమే.

ఇది ఒకరకంగా మేకర్స్ ఊహించని రిజల్ట్ అనే చెప్పాలి. kgf తర్వాత ఏకంగా నాలుగేళ్ళ పాటు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులకి సర్ ప్రైజ్ ఇవ్వాల్సిన యష్ పెద్ద షాకే ఇచ్చాడు.

వీకెండ్ పై భారీ ఆశలే

Advertisement

అయితే సినిమా రాబోయే వీకెండ్ పై భారీ ఆశలే పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా గట్టుపడాలి అంటే ఈ శని,ఆదివారాలలో టాక్సిక్ తన శక్తికి మించిన వసూళ్ళని రాబట్టాలి.కాని ఇపుడు సినిమాపై వస్తున్న నెగెటివ్ టాక్ చూస్తే అది సాధ్యమా అంటే అనుమానమే.పైగా ఇపుడు సినిమాని మోయాల్సింది అభిమానులు కాదు..కామన్ పబ్లిక్.మరి సినిమా పై వస్తున్న ట్రోల్స్,కామెంట్స్,మీమ్స్ చూసి వారంతా ఇళ్ళల్లో నుండి కదలడం అటుంచి, ott కోసం వెయిట్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

థియేటర్ లో ఉంటాడో లేదో

మొత్తానికి యష్ కి ఈ సినిమా కళ్ళు తెరిపించినట్టే ఉంది.ఫ్యాన్ ఇండియా మోజులో పడి కథా.. కాకరకాయ.. అంటూ నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో టాక్సిక్ ప్రూవ్ చేసింది. చూడాలి మరి రెండో రోజుకే చేతులెత్తేసిన ఈ రాయా వచ్చే వారం కల్లా థియేటర్ లో ఉంటాడో లేదో !

Tags

Related News

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు!

200 కోట్ల టార్గెట్.. ఇరుముడి రీచ్ అవుతుందా?

రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!

శ్రీ పట్టాభి రామచంద్ర ఆలయ ప్రతిష్ట మహోత్సవం.. ముఖ్య అతిథులుగా దిల్ రాజు దంపతులు!

రక్షాబంధన్ స్పెషల్… శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్!

మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!

ముగిసిన జీ.వీ.నారాయణరావు అంత్యక్రియలు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×