E-Paper
Advertisement

శ్రీ పట్టాభి రామచంద్ర ఆలయ ప్రతిష్ట మహోత్సవం.. ముఖ్య అతిథులుగా దిల్ రాజు దంపతులు!

శ్రీ పట్టాభి రామచంద్ర ఆలయ ప్రతిష్ట మహోత్సవం.. ముఖ్య అతిథులుగా దిల్ రాజు దంపతులు!
Advertisement

Dil Raju: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు తాజాగా వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని జెఎస్ఆర్ నగర్ లో సందడి చేశారు. జె ఎస్ ఆర్ నగర్ లో నిర్మించిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయ మహోత్సవ వేడుకలో భాగంగా దిల్ రాజు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ గ్రామ పెద్దలు హీరో వంశీకృష్ణ దిల్ రాజు దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దిల్ రాజు ఆలయాన్ని సందర్శించి శ్రీ పట్టాభి రామచంద్రస్వామి వారి అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇలా ఆలయ మహోత్సవ వేడుకలో పాల్గొన్న దిల్ రాజు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

కుటుంబ సమేతంగా హాజరైన దిల్ రాజు..

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. పోరుమామిళ్లలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరాములు ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా వచ్చినట్లు తెలియజేశారు. తమ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని, వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంటే శ్రీరాముడే అంటూ దిల్ రాజు తెలియచేశారు. ఇలాంటి ఒక గొప్ప వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని దిల్ రాజు తెలియజేశారు. అదే విధంగా 20 సంవత్సరాల క్రితం ఆయన ప్రొద్దుటూరు,కడప, పోరుమామిళ్ల ప్రాంతాలలో వ్యాపారం చేసినట్టు అప్పటి విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సొంత గ్రామంలో ఆలయం మహాభాగ్యం..

Advertisement

ఇక హీరో వంశీకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ..మా ఆహ్వానం మేరకు పిలవగానే దిల్ రాజు హైదరాబాద్ నుంచి పోరుమామిళ్ళకు రావడంతో ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సొంత గ్రామంలో ఆలయాన్ని నిర్మించడం మహాభాగ్యంగా భావిస్తూ ఇలాంటి ప్రోత్సాహం ఎల్లప్పుడు గ్రామస్తుల నుంచి ఉండాలని వంశీకృష్ణ కోరారు. గ్రామస్తులు ఎల్లప్పుడూ భక్తి మార్గంలో వెళ్తూ అందరి పట్ల ప్రేమాభిమానాలతో ఉండాలని సూచించారు. అదేవిధంగా ఆలయ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి వంశీకృష్ణ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

విజయవంతంగా రామాలయ ప్రతిష్ట మహోత్సవం..

ఆలయం స్థలదాత శ్రీరాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ దిల్ రాజు గారు నిరంతరం తన పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సి ఉన్న తమ ఆహ్వానం మేరకు తన కార్యకలాపాలను రద్దు చేసుకొని పిలవగానే రామాలయ ప్రతిష్టకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీరాములు ధన్యవాదాలు తెలియజేశారు. దిల్ రాజు సూచించిన విధంగా ఆలయం నిర్మించడమే కాదు ప్రతిరోజు నిష్టగా పూజలు కూడా నిర్వహించబడతాయని తెలియజేశారు.

Related News

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు!

200 కోట్ల టార్గెట్.. ఇరుముడి రీచ్ అవుతుందా?

రకుల్ కొత్త ఫిలాసఫీ.. ట్రెండీ ఔట్ఫిట్ తో ఆకట్టుకునే లుక్స్!

టాక్సిక్ అప్పుడే చేతులెత్తేసిందా?

రక్షాబంధన్ స్పెషల్… శర్వా ‘భోగి’ స్పెషల్ పోస్టర్ రిలీజ్!

మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!

ముగిసిన జీ.వీ.నారాయణరావు అంత్యక్రియలు.. చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×