E-Paper
Advertisement

నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!

నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!
Advertisement

Nepal Floods: నేపాల్ లో సంభవించిన భారీ వరదలు మహా విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో మరిణించిన వారి సంఖ్య 538కి చేరినట్లు నేపాల్ డిజాస్టర్ అధికారికంగా ప్రకటించింది. మరో 977 మంది ఆచూకి గల్లంతయ్యిందని పేర్కొంది. ప్రస్తుతం వారి కోసం కోసం గాలిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు చైనాలో కూడా ఈ అకస్మిక వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపింది. కనీసం ఐదుగురు మరణించినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించడంతో రెండు దేశాల్లో కలిపి మొత్తం మృతుల సంఖ్య 543కి చేరింది. ప్రస్తుతం రెండు దేశాల పరిధిలో కలిపి దాదాపు 1,500 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు.

2015 తర్వాత అతిపెద్ద విపత్తు

2015లో సంభవించిన తీవ్ర భూకంపం తర్వాత నేపాల్‌ను ముంచెత్తిన అతిపెద్ద, దారుణమైన ప్రకృతి విపత్తు ఇదే కావడం గమనార్హం. హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న గ్లేసియర్ (మంచు కొండ) ఒక్కసారిగా కూలిపోవడంతో సరస్సులోని నీరు, పైనున్న బండరాళ్లు ఒక్కసారిగా కింద వైపునకు దూసుకొచ్చాయి. ఈ కారణం చేతనే విపరీతమైన నష్టం జరిగినట్లు ‘యుఎస్ జియోలాజికల్ సర్వే’ స్పష్టం చేసింది.

3,742 మంది సురక్షితం

Advertisement

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను కాపాడేందుకు నేపాల్ ప్రభుత్వం దాదాపు 14,000 మందికి పైగా భద్రతా బలగాలను రెస్క్యూ ఆపరేషన్‌లో మోహరించింది. ఇప్పటివరకు సుమారు 3,742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 85 మంది భారతీయులు ఉండటం గమనార్హం. అయితే, ప్రతికూల వాతావరణం, రోడ్లన్నీ వరద ఉధృతికి కొట్టుకుపోవడం వల్ల గాలింపు చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: శ్రావణమాసంలో చికెన్ అడిగాడని.. కొడుకును చంపిన పేరెంట్స్.. ఇలా ఉన్నారేంటయ్యా!

మరో ప్రమాద హెచ్చరిక

ఇదిలా ఉంటే టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక ప్రాజెక్ట్ డ్యామ్ నిండి బరస్ట్ కావడంతో నేపాల్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు తాజా హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అలాగే సహాయక చర్యల్లో పాల్గొంటున్న భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. నీటి ఉధృతి పెరిగితే తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

Also Read: మనిషి లేని భూమికి.. కొత్త బాస్ ఎవరో తెలుసా? సైన్స్ చెప్పే షాకింగ్ నిజాలు!

Tags

Related News

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీల మెరుపుదాడి, 12 మంది మృతి, అలర్టయిన అమెరికా

అమెరికాలో కాల్పుల కలకలం.. గర్భిణి, పిల్లలు సహా 9 మంది మృతి!

కుప్పకూలిన నెట్‌వర్క్‌లు, మూతపడ్డ ఎయిర్‌పోర్ట్.. పనామాలో మహా విపత్తు!

Big Stories

Advertisement
×