Realme C100i 4G: బడ్జెట్‌లో మంచి బ్యాటరీ, పెద్ద స్క్రీన్ కావాలనుకునే వారికి రియల్ కొత్తగా C100i 4G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ.14,999 ధరతో వచ్చిన ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, భారీ 7,000mAh బ్యాటరీ, Unisoc ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ అవసరాలకు సరిపోయేలా రూపొందించిన ఈ ఫోన్‌లో ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం.
Realme C100iలో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో రావడంతో వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, యాప్స్‌లో స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉన్న ఈ స్క్రీన్ హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 900 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. డిస్‌ప్లేకు పండా గ్లాస్ రక్షణ ఉంది.
Also Read: ఫోన్ అప్‌డేట్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయాలా? చేయకపోతే ఏమవుతుందో తెలుసా?
ఈ ఫోన్‌లో Unisoc T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 4GB LPDDR4X RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 6.0తో పనిచేసే ఈ ఫోన్ సాధారణ కాల్స్, బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటి పనులకు అనుకూలంగా ఉంటుంది.
Realme C100iలో 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. దీనికి 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి పెద్ద బ్యాటరీ ఉపయోగకరంగా ఉంటుంది.
ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు f/2.0 అపెర్చర్‌తో 8MP కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5MP కెమెరా ఇచ్చారు. అలాగే ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది. రూ.14,999 ధరలో పెద్ద డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 7,000mAh బ్యాటరీ కోరుకునే వారికి C100i బడ్జెట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
Also Read: సోనీ కంపెనీ ఫోన్లు తయారు చేయడం ఆపేసిందా? అసలు ట్విస్ట్ తెలిస్తే..