E-Paper
Advertisement

టాక్సిక్ తర్వాత యష్ చేయబోయే సినిమాలు ఇవే ?

టాక్సిక్ తర్వాత యష్ చేయబోయే సినిమాలు ఇవే ?
Advertisement

Yash Next Movies :kvnప్రొడక్షన్స్ పై గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన సినిమా టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ మూటగట్టుకుని పడుతూ లేస్తు ఉంది. ఇక సినిమాకి పెట్టిన బడ్జెట్ వస్తుందా లేదా అన్న డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి.ఇదిలా ఉండటంతో ఇక అందరి చూపు యష్ చేయబోయే సినిమాల వైపు మళ్ళుతుంది.మరి ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం యష్ నుండి తర్వాత వచ్చే సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం.

ప్రముఖంగా కనిపించేది రాయాయణ

యష్ టాక్సిక్ తర్వాత చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ..ప్రముఖంగా కనిపించేది రాయాయణ.రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాకి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.దంగల్ సినిమాకి దర్శకత్వం వహించింది ఈయనే.ఇక ఇందులో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్న సంగతి తెల్సిందే.

Advertisement

ఇక ఇదే సినిమాలో రావణుడిగా అలరించబోతున్నాడు యష్.హీరోగా నేషనల్ వైడ్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న యష్ విలనిజం పండించే రావణుడి పాత్రని ఒప్పుకోవడమే ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే అంశం.అలాంటిది యష్ రావణుడి ఇందులో ఎన్ని రకాల షేడ్స్ ని చూపిస్తాడో వేచి చూడాల్సిందే.ఇక రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మొదటి భాగం కన్నా రెండో భాగంలోనే యష్ మరింత విజృంభించబోతున్నాడని బీటౌన్ లో వినిపిస్తున్న టాక్.

ఇక ఈ సినిమా ని ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ చేయనున్న మేకర్స్ రెండో భాగాన్ని వచ్చే ఏడు దీపావళికి చేయనున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. చూడాలి మరి దాదాపు 4000కోట్ల బడ్జెట్ తో తెరకక్కుతున్న ఈ సినిమాలో రావణాసురిడిగా యష్ తన విశ్వరూపాన్ని ఎలా చూపించనున్నాడో .

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో

Advertisement

ఇక ఈ సినిమా తర్వాత యష్ నటిస్తాడని వినిపిస్తున్న మరో సినిమా ‘కేజీఎఫ్ చాప్టర్ 3’.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాంపేజ్ ఆడించాయో చెప్పకర్లేదు. ముఖ్యంగా kgf 2 అంటూ వచ్చిన సినిమా తొలిసారి సాండల్ వుడ్ కి వెయ్యి కోట్లని పరిచయం చేసింది.

ఇక చివర్లో మూడో భాగం కూడా వస్తుందని మేకర్స్ హింట్ ఇవ్వడంతో కేజీఎఫ్ చాప్టర్ 3 ఎప్పుడెప్పుడా అని కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు రాఖీ భాయ్ ఫ్యాన్స్.మరి నీల్ మామ డ్రాగన్ కంప్లీట్ అవ్వగానే యష్ తో ఇదే ప్రాజెక్ట్ ని ఆన్ బోర్డ్ చేస్తాడా లేక మధ్యలో సలార్ 2 అంటూ ఏమైనా చక్కర్లు కొడతాడా చూడాలి.కాని ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పడంతో యష్ చేయబోయే సినిమాలలో ఇది కూడా ఒకటంటూ లెక్క గడుతున్నారు ట్రేడ్ పండితులు.

కోలీవుడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్‌తో

ఇక ఇదే లిస్టు లో కోలీవుడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్‌తో యష్ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడు అంటూ ఒక వార్త వినిపిస్తుంది.పి.ఎస్. మిత్రన్‌ అంటే ఎవరో కాదు గతంలో ‘అభిమన్యుడు’, ‘సర్దార్’ వంటి సినిమాలని తీసిన దర్శకుడు ఈయనే. మరి వినిపిస్తున్నట్టుగా నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేక రూమర్స్ కే పరిమితం అవుతుందా చూడాలి.

దిల్ రాజు యష్ తో సినిమా తీస్తాడా

ఇక యష్ తో నేనూ ఒక సినిమా తీసుకుంటానని ముచ్చట పడుతున్నాడట దిల్ రాజ్ . మరి సోషల్ మీడియాలో వినిపించినట్టుగా నిజంగానే దిల్ రాజు యష్ తో సినిమా తీస్తాడా లేక టాక్సిక్ దెబ్బకి అటు వైపు చూడకుండా వస్తాడా అన్నది మరికొద్ది రోజులు ఆగితే కాని తెలీదు.

సొంత ప్రొడక్షన్ హౌస్ లో 

ఇక వీటితో పాటు తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ ద్వారా పలు ప్యాన్ ఇండియా సినిమాలని కూడా తీసుకొస్తానని గతంలో చెప్పుకువచ్చాడు యష్ .మరి దీనిలో అతడేనా లేక మరెవరైనా వచ్చి చేరుతారా చూడాలి. ఏది ఏమైనా టాక్సిక్ దెబ్బకి ఇపుడు యష్ ఎలాంటి సినిమాని ఎంచుకుంటాడా అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారంతా ..చూడాలి మరి యష్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో !

Tags

Related News

మళ్లీ లాయర్‌గా కీర్తి సురేష్.. ఈసారి అయినా హిట్ కొడుతుందా?

చిరుత హీరోయిన్ అందాల విందు.. ఇన్‌స్టాలో హాట్ టాపిక్!

హైందవ టీజర్ రిలీజ్…విగ్రహాల చోరీ వెనుక రహస్యం ఏంటీ!

కాంతార వైబ్‌లో గోపీచంద్ ‘భరత వర్ష’.. ఫస్ట్ సాంగ్ అదిరిపోయిందిగా!

కడుపు నిండిపోయింది.. ఫౌజీ హీరోయిన్ కు ఫుడ్ పంపి సర్ప్రైజ్ చేసిన ప్రభాస్!

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×