E-Paper
Advertisement

రెండో పెళ్లిపై ట్రోల్స్… ఒక్క ఫోటోతో కౌంటర్ ఇచ్చిన నటి శిరీష!

రెండో పెళ్లిపై ట్రోల్స్… ఒక్క ఫోటోతో కౌంటర్ ఇచ్చిన నటి శిరీష!
Advertisement

Actress Sireesha: మొగలిరేకులు సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిరీష(Sireesha) అనంతరం చెల్లెలికాపురం, రాములమ్మ, మా ఇంటి దేవత వంటి పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శిరీష ఇటీవల రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదివరకే పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన శిరీష తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నారు.

శిరీష రెండో పెళ్లి పై విమర్శలు..

ఈమె గత కొంతకాలంగా ఆర్. జె మహేంద్ర (R.J.Mahendra)తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి రిలేషన్ గురించి ఇదివరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అయితే ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 28వ తేదీ మహేంద్ర శిరీషల వివాహం ఎంతో ఘనంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా శిరీష తన రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఈమె పై విమర్శల వర్షం కురిపించారు.

కొడుకు ఉండగా రెండో పెళ్లి ఏంటీ?

Advertisement

ఇదివరకే పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు మీ కొడుకును ఎక్కడ వదిలిపెట్టారు? అంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ విమర్శించారు . ఇక ఈమె రెండో పెళ్లి చేసుకోవడంతో మరి కొంతమంది అభిమానులు మాత్రం శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేశారు. ఇలా తన కొడుకు గురించి అలాగే తన రెండో పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శిరీష తన పెళ్లి గురించి వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే తన పెళ్లి రిసెప్షన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలు తన కొడుకుతో కలిసి దిగటం విశేషం.ఇలా తన కొడుకు అంగీకారంతోనే, తన కొడుకు సమక్షంలోనే తన పెళ్లి జరిగిందని తన కొడుకును వదిలేయలేదు అంటూ ఈమె ట్రోలర్స్ కు పరోక్షంగా గట్టిగా కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శిరీష ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా పెద్ద ఎత్తున తన వీడియోలు రీల్స్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మరోవైపు మహేంద్ర కూడా నటుడిగా యాంకర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×