BigTV English

OG Movie : ఓజీ ఎఫెక్ట్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టారు!

OG Movie : ఓజీ ఎఫెక్ట్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఉరికించి కొట్టారు!

OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ అంచనాల మధ్య ఓజీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో.. ఎస్.తమన్ (S.Thaman ) సంగీత దర్శకుడిగా.. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya), తన నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలలో కూడా భారీ హడావిడితో నిన్నే (సెప్టెంబర్ 24) ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రాంతాలలో థియేటర్ల వద్ద ఈ సినిమా కోసం అభిమానులు ఏ రేంజ్ లో సందడి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


కర్ణాటకలో పవన్ ఫ్యాన్స్ ను తరిమికొట్టిన స్థానికులు..

అయితే అలాంటి ఈ సినిమాకి కర్ణాటకలో భారీ ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడి స్థానికులు చేసిన పనికి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకెళితే.. నిన్న చాలా థియేటర్లలో ఓజీ ప్రీమియర్ షోలు పడిన విషయం తెలిసిందే ..అయితే ప్రీమియర్ షో కంటే ముందే అభిమానులు థియేటర్లకు చేరుకొని పెద్ద ఎత్తున హంగామా చేశారు.

also read:Star Singer : మూడో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ పాప్ సింగర్.. ఏం పేరు పెట్టారో తెలుసా?


అసలేం జరిగిందంటే?

అలాగే కర్ణాటక బెంగళూరులోని ఒక థియేటర్ కి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. OG ..OG అంటూ నినాదాలు కూడా చేశారు. పైగా డీజేలు పెట్టి అక్కడి స్థానికులకు ఇబ్బంది కలిగించారట. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తం కావడంతో ఇది గమనించిన స్థానికులు వెంటనే రంగంలోకి దిగి అక్కడి నుండి పవన్ కళ్యాణ్ అభిమానులను తరిమికొట్టారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఏది ఏమైనా ఈ విషయం అటు పవన్ కళ్యాణ్ కి కూడా భారీ షాక్ కలిగించే అంశం అని చెప్పవచ్చు.. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్తే ఆయన దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఓజీ సినిమా విశేషాలు..

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విషయానికి వస్తే.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ అని చెప్పినా.. సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఒకసారి చూసే సినిమా మాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. కానీ ముఖ్యంగా ఎమోషన్స్ సన్నివేశాలను పండించడంలో సుజీత్ ఫెయిల్ అయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా హీరోయిన్ ఎంట్రీ తర్వాత ఇది సినిమా లాగా కాకుండా సీరియల్ రేంజిలో సాగింది అని.. సామాన్య సినీ ప్రేక్షకుడు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనిపించే అంత రేంజ్ లో అయితే ఏమీ లేదు అనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి.

Related News

Jayam Ravi: భార్యా పిల్లలను రోడ్డుకీడుస్తున్న జయం రవి.. ఏకంగా ఇంటినే వేలం వేస్తూ!

OG Movie: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో ఓజీ 2 కూడా?

OG Collections: ఓజీ డిస్ట్రక్షన్… ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 160 కోట్లు

Chiranjeevi: ఓజీ రివ్యూ చెప్పేసిన చిరు.. కళ్యాణ్ బాబును అలా చూడడం..

Nagarjuna: న్యాయం చేయండి.. ఢిల్లీ హైకోర్టుకు హీరో నాగార్జున

Star Singer : మూడో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ పాప్ సింగర్.. ఏం పేరు పెట్టారో తెలుసా?

Tollywood: తల్లి కాబోతున్న హీరోయిన్ చెల్లి.. మరి అక్క సంగతేంటి? బేబీ బంప్ ఫోటోలు వైరల్!

Big Stories

×