JanaSena: జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారా? వైసీపీతోపాటు కొందరు సీనియర్ నేతలు, మాజీ అధికారులు ఆయనతో మంతనాలు జరుపుతున్నారా? వారిలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ జనసేనలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత ఎన్నికల ముందు కొత్తగా పార్టీ పెట్టిన ఆయన సక్సెస్ కాలేదు. కాకపోతే నిత్యం టీడీ డిబేట్లలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఓ ఛానెల్ చర్చవేదికలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని కొనియాడారు.
పార్టీ పరంగానే కాకుండా, పాలనా పరంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను అభినందించాల్సినని ఓపెన్ అయ్యారు. రాజకీయంగా అంచెలంచెలుగా ఆయన ఎదిగిన తీరు బాగుందన్నారు. అలాగే మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం గెలుపు ఆషామాషీ కాదన్నారు. ఆ పార్టీ నేతలు టచ్‌లో ఉన్నారని మనసులోని మాట బయపెట్టారు.
విశాఖలో తాను పోటీ చేసినప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు, మహిళా వింగ్ ఇచ్చిన సపోర్టుని ఎప్పటికీ మరువలేనని వెల్లడించారు. ఏపీలో ప్రజలు పవన్ వైపు చూస్తున్నారని, ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ఆ పాత్ర పోషించాలన్నారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి రావడం లేదని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో పాత్ర పవన్ కీలకపాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ALSO READ: ఏపీలో మూడు రోజులు దంచుడే, 10 జిల్లాల్లో భారీ వర్షాలు
గ్రామీణ ప్రజలు, గిరిజనుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని కితాబు ఇచ్చారు. అలాగే సమస్యలతో వచ్చినవారితో మమేకం అవుతున్నారని చెప్పారు. పవన్ గురించి జేడీ లక్ష్మీనారాయణ ఈ విధంగా మాట్లాడడంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశముందనే చర్చ లేకపోలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయ నేతలు అడుగులు వేస్తుంటారు.
మరి జేడీ కూడా ఆ విధంగా నిర్ణయాలు ఉంటారా? ఇదివుండగా జనసేనలో జేడీ రీఎంట్రీ గురించి చర్చ జరుగుతోందని ఆ పార్టీ వర్గాల మాట. ఒకవేళ ఆయన వస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరి జేడీ మనసులో ఏముందో ఎవరికి ఎరుక. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో రెండేళ్ల తర్వాతైనా జేడీ వైపు నుంచి క్లారిటీ రావచ్చని అంటున్నారు.