Nagarjuna:టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన అవగాహన సదస్సులో సంచలన విషయాలను వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం తాను స్వయంగా సైబర్ మోసానికి గురయ్యానని, అలాగే ఇటీవల తన కుటుంబంలో ఒకరు ‘డిజిటల్ అరెస్ట్’ బారిన పడ్డారని చెప్పి అందరినీ షాక్‌కు గురిచేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన ‘సురక్ష కా తిరంగా’ ప్రోగ్రామ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి.
తనకు జరిగిన సైబర్ మోసం గురించి నాగార్జున మాట్లాడుతూ, నాలుగేళ్ల క్రితం బ్యాంకు అధికారిని అని చెబుతూ ఒక వ్యక్తి తనకు ఫోన్ చేశాడని తెలిపారు. భారీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అని, ఇందులో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి నమ్మించి తన్ను ట్రాప్ చేశారని వెల్లడించారు. ఇక ఎంతటి వారికైనా అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలని, తెలియని యాప్‌లను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోకూడదని నాగార్జున హెచ్చరించారు.
ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ బారిన తన కుటుంబ సభ్యుడు ఒకరు పడ్డారని నాగార్జున సంచలన నిజం బయటపెట్టారు. దాదాపు రెండు రోజుల పాటు వారిని డిజిటల్‌గా నిర్బంధించి తీవ్ర భయాందోళనకు గురి చేశారని చెప్పారు. ఇక తాము వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చే లోపే ఆ సైబర్ నేరగాళ్లు తప్పించుకున్నారని, ఈ సంఘటన తమ కుటుంబాన్ని తీవ్రంగా కలవరపెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
also read:స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రోజా, శ్రీకాంత్.. మాటలు రావట్లేదంటూ!
పైరసీ మరియు సైబర్ క్రైమ్స్ పై స్పందిస్తూ, పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషిని నాగార్జున అభినందించారు. ఏదో ఉచితంగా సినిమా చూస్తున్నాం కదా అని చాలామంది పైరసీ వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తుంటారని, కానీ దాని వెనుక సైబర్ నేరగాళ్ల పెద్ద ప్లాన్ ఉంటుందని గుర్తించాలని చెప్పారు. ఇక ఆ వెబ్‌సైట్ల ద్వారా మన వ్యక్తిగత వివరాలను, బ్యాంక్ డాటాను వారు చాలా సులువుగా దొంగిలిస్తారని ప్రజలను హెచ్చరించారు.
సామాన్యులకే కాదు, నాగార్జున లాంటి ప్రముఖులకు, వారి కుటుంబాలకు కూడా సైబర్ సెక్యూరిటీ ముప్పు తప్పడం లేదని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త రకం ఎత్తుగడలతో అమాయకులను దోచుకుంటున్న ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరూ సైబర్ అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఇక అనుమానాస్పద కాల్స్, డిజిటల్ బెదిరింపులకు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడమే దీనికి ఏకైక పరిష్కారమని నాగార్జున సందేశాన్ని ఇచ్చారు.
"నాలుగేళ్ల క్రితం బ్యాంకు అధికారులం అంటూ ఫోన్ చేసి నన్ను కూడా ట్రాప్ చేశారు" అంటూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కార్యక్రమంలో సంచలన విషయం వెల్లడించిన @iamnagarjuna ఇటీవల తన ఫ్యామిలీలో ఒకరు 'డిజిటల్ అరెస్ట్' కు గురయ్యారని కూడా తెలిపారు.!#Akkineni #Nagarjuna #CyberCrime… pic.twitter.com/3jx8wv0VVC
— BIG TV Cinema (@BigtvCinema) August 14, 2026