E-Paper
Advertisement

ఐఐటీ బంపరాఫర్.. ఏడాదిపాటు ఏఐ కోర్సు ఉచితం.. భోజనం-స్టైఫండ్‌ కూడా

ఐఐటీ బంపరాఫర్.. ఏడాదిపాటు ఏఐ కోర్సు ఉచితం.. భోజనం-స్టైఫండ్‌ కూడా
Advertisement

IIT Offer: టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత రోజుల్లో ఎడ్యుకేషన్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. యువతీయువకులను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజా ఓ ఐఐటీ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చేసింది. ఏడాదిపాటు ఉచితంగా ఏఐ కోర్సు నేర్పనుంది. అంతేకాదు భోజనం, స్టైఫండ్ కూడా ఇవ్వనుంది. ఇంతకీ ఏ ఐఐటీ తెలుసా?

 

ఐఐటీ ధార్వాడ్‌ విద్యార్థులకు బంపరాఫర్

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఏఐ రాజ్యమేలుతోంది. ఈ కోర్సు నేర్చుకుంటే మరో 20 ఏళ్లు తిరుగు ఉండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో కెరీర్‌ మొదలుపెట్టాలనుకునే వారికి అద్భుతమైన ఛాన్స్. ఏకంగా ఐఐటీల్లో చదివే ఛాన్స్ కూడా వస్తుంది. ఐఐటీ ధార్వాడ్‌ విద్యార్థులకు ఉచితంగా ఏడాది ఏఐ కోర్సు ట్రైనింగ్ ఇవ్వనుంది. అంతేకాదు హాస్టల్‌, భోజనం, వసతి సౌకర్యాలతోపాటు నెలకు రూ.1000 స్టైఫండ్‌ ఇవ్వనుంది. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. కేంద్ర మైనారిటీ శాఖకు చెందిన పీఎం వికాస్‌ పథకం 2026-27లో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఏఐ టెక్నోక్రాట్‌ పేరుతో ఏడాదిపాటు రెసిడెన్షియల్‌ కోర్సు.

 

ఏడాదిపాటు కోర్సుతోపాటు భోజనం, వసతి కూడా

Advertisement

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మైనారిటీ వర్గాలకు చెందిన 18- 45 ఏళ్ల మధ్య యువ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు వంటి కులాల యువకులు అర్హులు. అప్లికేషన్లపై ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఐఐటీ ధార్వాడ్‌లో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం కూడా ఉంటుంది. స్కిల్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన సర్టిఫికెట్‌ ఇవ్వనుంది. అందులోని విద్యార్థులకు కేంద్రం నుంచి నేరుగా డీబీటీ ద్వారా నెలకు రూ.1,000 స్టైపెండ్‌ వస్తుంది. కోర్సు తర్వాత ఉద్యోగంలో చేరినవారికి రెండు నెలల పోస్ట్‌-ప్లేస్‌మెంట్‌ సపోర్ట్‌ ఉండనుంది. ఉద్యోగం పొందిన అభ్యర్థులకు రూ.4,000 ఆర్థిక సాయం ఇవ్వనుంది. అసలు విషయం ఏమిటంటే.. 33 శాతం సీట్లు మహిళా అభ్యర్థుల కోసం రిజర్వ్ చేస్తారు. 15 శాతం వరకు సీట్లు ఆర్థికంగా బలహీన వర్గానికి (EWS) చెందిన మైనారిటీయేతర అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి.

దరఖాస్తుతోపాటు దరఖాస్తుదారులు ఈ కింది పత్రాలను అప్‌లోడ్ చేయాలి

వయస్సు నిర్ధారణ కోసం 10వ తరగతి సర్టిఫికేట్
డిగ్రీ సర్టిఫికెట్
ఆధార్ కార్డు
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
బ్యాంకు పాస్‌బుక్
EWS సర్టిఫికేట్ ఉంటే..
మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికెట్
రిజర్వేషన్

 

Related News

జనగణనలో మొత్తం 40 ప్రశ్నలు ఇవిగో, కులంతోపాటు బ్యాంకు అకౌంట్లు కూడా

పొట్టకూటి కోసం నేలను తవ్వితే.. రూ.50 లక్షల వజ్రం దొరికింది.. జాక్ పాట్ కొట్టిన కూలీలు!

తనకు-విద్యార్థుల మధ్య వ్యవహారం.. బార్ కౌన్సిల్ నిర్ణయంపై సీజేఐ రియాక్ట్

వాహనదారులకు బిగ్ షాక్.. ఇంటి ముందు పార్కింగ్‌ చేస్తే రూ.25 వేలు, కొత్త రూల్స్ ఎక్కడో తెలుసా?

ఉత్తరాఖండ్‌ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు, ఇంకా

ఎర్రకోట పేలుడు వెనుక ‘అల్ ఖైదా’.. ఐరాస భద్రతా మండలి సంచలన నివేదిక!

బస్సులో పోయిన రూ.24 వేలు.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ చేతికొచ్చాయ్.. కండక్టర్ మామూలోడు కాదు సామీ!

Big Stories

Advertisement
×