E-Paper
Advertisement

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!
Advertisement

Director Shiva Nirvana:మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva nirvana) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇరుముడి(Irumudi). ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 100కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. జీవి ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) అందించిన సంగీతం, డైరెక్టర్ శివ నిర్వాణ విజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని , వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు లాభాల వర్షం కురిపిస్తోంది.

నక్షత్ర లాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు – డైరెక్టర్

సినిమా సక్సెస్ అందుకున్న నేపథ్యంలో.. హైదరాబాద్ వేదికగా బ్లాక్ బాస్టర్ పేరిట ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో డైరెక్టర్ శివ నిర్వాణ ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో భాగంగానే బేబీ నక్షత్ర (Baby Nakshatra) గురించి ఒక ఎమోషనల్ మాట చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. డైరెక్టర్ శివా నిర్వాణ మాట్లాడుతూ..” నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలో లేదో తెలియదు. కానీ పాప అనుమతి తీసుకొని ఈ వేదికపై ఆమె గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజంగా సినిమాలలో ఆడపిల్లలు ఎంత ధైర్యంగా పెరగాలి.. తల్లిదండ్రులు వారిని ధైర్యంగా ఎలా పెంచాలి అనే విషయాలు చెబుతూ ఉంటాము. అయితే నక్షత్ర లాంటి ధైర్యం ఉన్న చిన్నారిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆమె పేరుకు తగ్గట్టుగా ఒక స్టార్.. అద్భుతమైన చిన్నారిని ఈ సందర్భంగా ప్రసంశించకుండా ఉండలేకపోతున్నాను ” అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు.

నక్షత్రకు తండ్రి లేరు – శివా నిర్వాణ

Advertisement

అలాగే ఆమె గురించి మాట్లాడుతూ.. “షూటింగ్ ప్రారంభించినప్పుడు నక్షత్రకి మలయాళం తప్ప.. తెలుగు రాదు. అందుకే మలయాళం, తెలుగు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను ఆమెకు సహాయంగా పెట్టాము. ప్రతి విషయాన్ని రెండు భాషల్లో వివరించేలా చేసాము. కామెడీ సీన్లు, పాటలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక ఎమోషనల్ సీన్ వచ్చింది. అది తండ్రికి సంబంధించిన చాలా ఎమోషనల్ సీన్.. నేను ఆమెకు కొన్ని సూచనలు ఇచ్చి, మీ తండ్రిని ఊహించుకొని చెయ్యి అని చెప్పాను . దానికి నక్షత్ర నాకు మా నాన్న లేరు అని చెప్పింది. ఇక ఒక్కసారిగా ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పటికే నక్షత్ర రెండు మూడు ఎమోషనల్ సీన్లు కూడా చేసింది. పర్వాలేదు నువ్వు ఎంత ఎమోషన్ తీసుకురాగలవో అంత తీసుకురా అని చెప్పాను. ఇక అంతకుమించి చెబితే నక్షత్రకు తన తండ్రి గుర్తొచ్చి మరింత బాధపడుతుందని భావించే అలా చెప్పాను. కానీ ఆమె చాలా గట్టి గుండె కలిగింది.

also read:షట్‌డౌన్ దిశగా కోలీవుడ్?.. బంద్‌పై ‘ఫెఫ్సీ’ కీలక విజ్ఞప్తి!

క్లైమాక్స్ కి ప్రాణం పోసింది – డైరెక్టర్

Advertisement

నక్షత్ర క్లైమాక్స్ లో అద్భుతంగా నటించింది. సినిమా చివర్లో వచ్చే 20 నిమిషాల్లో ఈ చిన్న అమ్మాయి అద్భుతంగా నటించింది. ముఖ్యంగా దర్శకుడిగా నేను ఆశ్చర్యపోయేలా.. శివ సార్ బాగా చేయండి. మరో టేక్ తీసుకోండి. డోంట్ కాంప్రమైజ్ అని చెప్పే స్థాయిలో నక్షత్ర ఎమోషనల్ సీన్లలో తన పవర్ చూపించింది . ఒక దర్శకుడిగా నేనే ఆశ్చర్యపోయాను అంటూ సినిమా పట్ల, నటన పట్ల, తన పని పట్ల ఆమెకున్న డెడికేషన్ అభినందనీయం అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి అయితే నక్షత్ర గురించి కొన్ని రహస్యాలను డైరెక్టర్ బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

Related News

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

ఇదేం ప్రమోషన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..  కిల్లింగ్ లుక్ లో హాట్ బ్యూటీ..

షట్‌డౌన్ దిశగా కోలీవుడ్?.. బంద్‌పై ‘ఫెఫ్సీ’ కీలక విజ్ఞప్తి!

‘ఇరుముడి’ స్టోరీపై రవితేజ కూతురు రియాక్షన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్!

కళ్ళు చెదిరే లుక్ లో పాయల్.. సైమా నామినేషన్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న జబర్దస్త్ కొమరం..

కామెడీతో పాటు ఎమోషన్స్.. ఓజీ డైలాగ్స్ తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్!

Big Stories

Advertisement
×