Litton Das Three Ducks: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ (Litton Das)పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మూడు సార్లు డకౌట్ అయిన నేపథ్యంలో అతడిని ఆటపట్టిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియాకు 7500 కిలో మీటర్లు ప్రయాణించి.. మనోడు పీకిందేమీ లేదని దారుణంగా ఆడుకుంటున్నారు. రెండు టెస్టుల్లో మూడుసార్లు డకౌట్ కావడానికి వీడిని, అంత దూరం పంపించారా ? అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కొంచెం కూడా బుద్ధి లేదని పరువు తీస్తున్నారు. వీడు ఒక్కసారైనా బ్యాట్ ఝులిపిస్తే… బాగుండు అని సూచిస్తున్నారు. అంత దూరం వెళ్లి ఆస్ట్రేలియా బౌలర్లకు భయపడిపోయి.. వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడని పరువు తీస్తున్నారు. ఇలాంటి వాడిని ఆడి కారు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేయాలంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఆడి కారులో ఉన్న సున్నాలు నచ్చి, వరుసగా డకౌట్ అయ్యాడని చురకలు అంటిస్తున్నారు.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మొన్నటి వరకు రెండు టెస్టుల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్ అద్భుతమైన విజయం సాధించింది. రెండో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా విజృంభించి నుంచి ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. ఈ క్రమంలో రెండు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో ఆస్ట్రేలియా అలాగే బంగ్లాదేశ్ పంచుకున్నాయి. అయితే 7500 కిలో మీటర్ల పాటు బంగ్లాదేశ్ నుంచి ఆస్ట్రేలియా వరకు పర్యటించిన నేపథ్యంలో లిటన్ దాస్ మాత్రం అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచాడు.
రెండు టెస్టుల్లో అతడికి మూడు సార్లు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ మూడు ఇన్నింగ్స్ లలో ఒక్కసారి కూడా ఖాతా తెరవలేకపోయాడు. ఆడిన మూడుసార్లు డక్ ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో లిటన్ దాస్ పై ట్రోలింగ్ చేస్తున్నారు. 7500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి… 10 లక్షల వరకు లిటన్ దాస్ ఖర్చు చేసి, మూడు సార్లు డక్ అవుట్ కావడం దారుణం అంటున్నారు. ఇలాంటోడిని జట్టులో కొనసాగించడం దండగ అంటున్నారు. క్రికెట్ ను తీసేసి, ఆడి కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేయాలంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
ఆడి కారులో సింబర్ లో కూడా అన్ని సున్నాలే ఉంటాయని, అందుకే లిటన్ దాస్ వరుసగా డకౌట్స్ అయ్యాడని చురకలు అంటిస్తున్నారు. వాడి కోరిక మేరకు ఆడి కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేయాలంటూ కోరుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై మూడుసార్లు డకౌట్ అయిన లిటన్ దాస్ ను ఇటీవల టీ20లతో పాటు వన్డే కెప్టెన్ గా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియామకం చేసింది. మిరాజ్ పై వేటు వేసి లిటన్ దాస్ కు వన్డే క్రికెట్ బాధ్యతలు అప్పగించింది. అలాంటి బాధ్యతలు అందుకున్న లిటన్ దాస్ డకౌట్ కావడం మాత్రం దారుణమని అంటున్నారు.