Hyderabad: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికార పార్టీ నుంచి ఎదురుదాడి మొదలైంది. సింగరేణి కార్మిక గర్జనలో ఆయన చేసిన ఆరోపణలకు ధీటుగా కౌంటరిచ్చింది కాంగ్రెస్ సర్కార్. ప్రస్తుతం కేటిఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన్ని చూసి ప్రజలు చర్చించుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సింగరేణి కార్మిక గర్జన గురించి కీలక విషయాలు బయటపెట్టారు ప్రభుత్వం విప్ వేముల వీరేశం. సింగరేణికి కేటిఆర్ సినిమా ప్రమోషన్ మాదిరిగా వెళ్లారని, అక్కడ కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఆరోపించారు. గడ్డం పెంచుకుని వేషం మారుస్తున్నారని, గడ్డం పెంచుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాదిరిగా అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం మీడియా ముందుకొచ్చిన విప్ వీరేశం.. ప్రస్తుతం కేటిఆర్ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన్ని చూసి చర్చించుకుంటున్నారని విమర్శించారు.
దోచుకున్నది దాచుకోవడానికి సతమతమవుతున్నారని అన్నారు. కేటీఆర్‌కు దమ్ముంటే ఈ- కారు రేసు, కాళేశ్వరం గురించి విచారణ చేయమని లేఖ రాయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో చెల్లె ఒక భాగమైతే.. సంతోష్‌రావు మరో భాగం దోచుకున్నారని ఆరోపించారు. సిరులు కురిపించే సింగరేణిని చెరబట్టి దోచుకున్నారని, వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సింగరేణికి ద్రోహం చేసింది మీరు కదా? అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. అడ్డంగా దొరికిన దొంగ కేటిఆర్ అని, మూడు హోటల్స్ ఉన్నాయని ఒప్పుకున్నారని అన్నారు.
కేసీఆర్ బయటకు వస్తారని పదే పదే కేటీఆర్ చెబుతున్నారని, పెద్దాయన బయటకు రారని తేల్చేశారు విప్. కేటీఆర్.. సింగరేణికి వస్తే కార్మికుల సమస్యలు గురించి మాట్లాడుతారని అనుకున్నామని, అక్కడ సీఎం రేవంత్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ విజన్‌తో ప్రజలు ఏకీభవిస్తున్నారని, అందుకే కేసీఆర్ బయటకు రాలేకపోతున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
ALSO READ: భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!
ఎలినినోకు సీఎం రేవంత్‌రెడ్డి కారణమని అంటున్నారని, మరి కరోనాకు కేసీఆర్ కారణమా అంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. పారాసిట్ మాల్ వేసుకోమని మేము ఏమైనా చెప్పామా? 1951నుండి 2026 వరకు 16సార్లు ఎల్‌నినో పరిస్థితులు వచ్చాయని, దానివల్ల వర్షాలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు. కానీ ఈ విషయంలో కేటీఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.