India vs WI Uppal Match: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య నాలుగో టి20 హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా… అత్యంత దారుణంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం బౌలర్లే అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. అటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో ఓడిపోయింది. ఇలాంటి క్రమంలో టీమిండియా ఓటమికి ముఖ్య కారణం కండోమ్ యాడ్ ( Boys Will Play Well) అంటూ మరో ఆసక్తికర చర్చ సోషల్ మీడియా వేదికగా చురువైంది.
ఉప్పల్ స్టేడియం మెట్రో దగ్గర ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన కండోమ్ యాడ్ వేశారు. స్టేడియం లోపలకు వెళ్లే ముందు దీన్ని చూసిన టీమిండియా క్రికెటర్లు టెంప్ట్ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ పై ఫోకస్ చేయలేక వెస్టిండీస్ చేతిలో ఓడిపోయారని సోషల్ మీడియాలో దారుణంగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ యాడ్ చూసిన విండీస్ ప్లేయర్లు, ఏకాగ్రత కోల్పోకుండా మ్యాచ్ పై ఫోకస్ చేశారంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ తరుణంలోనే టీమిండియాపై విండీస్ ఊచకోత కోసిందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టి20 సందర్భంగా టీమిండియా 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్ విధించిన 248 పరుగుల టార్గెట్ ను చేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు కాస్త తడబడ్డారు. ఓపెనర్లు బాగా ఆడినప్పటికీ మిడిల్ ఆర్డర్ తేలిపోయింది. ఈ క్రమంలో ట్రాక్ లోకి వచ్చిన వెస్టిండీస్.. విజయం సాధించి సిరీస్ ను 2-2తో సమం చేసింది. ఇక బెంగళూరు వేదికగా గెలిచిన జట్టు సిరీస్ దక్కించుకోనుంది.
కాగా ఇప్పటి వరకు ఉప్పల్ స్టేడియం వేదికగా టీమిండియా నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడింది. ఈ స్టేడియంలో 3 వరుసగా విజయాలు అందుకున్న టీమిండియా… నిన్న మాత్రం ఓడిపోయింది. దీంతో ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి ఓటమిని తన పేరిట లిఖించుకుంది. ఎంతో ఆశగా వెళ్లిన తెలుగు అభిమానులకు ఉప్పల్ వేదికగా నిరాశ ఎదురయింది. అయితే దీని అంతటికి కారణం ఆ కాండోమ్ యాడ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరగడం గమనార్హం. ఉప్పల్ మెట్రో స్టేషన్ కు ఆ కాండోమ్ వేసి, విండీస్ ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీయాలని ప్లాన్ చేస్తే, అది టీమిండియాకే బెడిసికొట్టిందని మరికొందరు అంటున్నారు.