Akhanda 2 Movie Ticket Rates: నందమూరి బాలక్రష్ణ మోస్ట్ అవైయిటెడ్ మూవీ అఖండ 2 రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల హైక్‌కి పర్మిషన్ రాకపోవడం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అసలు టికెట్ల రేట్స్ హైక్ ఉంటుందా? లేదా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి.
దీనిపై రాష్ట్రంలో సర్వత్ర చర్చ మొదలైన నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. మూవీ టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తాజాగా జీవో జారీ చేసింది. దీంతో మూవీ టీం ఊపిరి పీల్చుకుంది. దీంతో రాష్ట్రంలో అఖండ 2 టికెట్స్ రేట్స్ హైక్ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కాగా రేపు మూవీ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి 8 గంటలకు షోకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆ మొత్తాన్ని FDC పర్యవేక్షణలో ప్రత్యేక ఖాతాకు జమ చేయాలి. థియేటర్లలో డ్రగ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అవగాహన ప్రకటనలు తప్పనసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం జీవోలో ఆదేశించింది. ఇచ్చిన అమలును థియేటర్ యాజమాన్యలు, మూవీ టీం పాటించారా లేదా అనేది డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది.
Also Read: Chay-Sobhita: మొదటి పెళ్లి రోజు.. చై లేకుండ నేను పరిపూర్ణం కాదు.. శోభిత ఎమోషనల్
ప్రీమియర్స్ షోలకు ఒక్కొక్కొ టికెట్ ధరను రూ. 600లుగా జీవో నిర్దారించింది. అలాగే మూవీ రిలీజ్ రోజున అంటే డిసెంబర్ 5న నుంచి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ. 50గా పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అలాగే మల్టీప్లెక్స్‌లో రూ. 100 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ఇక పెంచిన టికెట్ రేట్ల నుంచి 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మేకర్స్‌ని ఆదేశించింది. ఆ కండిషన్ ప్రకారం 20 శాతం అఖండ2 నిర్మాతలు మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇచ్చారా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే పెరిగిన టికెట్ రేట్ల కేవలం మూడు రోజులకే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం జీవో స్పష్టం చేసింది.
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వస్తున్న నాలుగవ చిత్రమిది. 2022లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఇందులో బాలయ్య అఘోరగా శివ తాండవం చూపించబోతున్నారు. తొలి పార్ట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో సీక్వెల్‌పై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సల్మాన్ భజరంగ్ భాయిజాన్ మూవీ ఫేం మున్ని అలియాస్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది.