Kota Srinivas: టాలీవుడ్ ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు(Kota Srinivas Rao) మరణ వార్త ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన నేడు ఉదయం 4 గంటల సమయంలో కన్నుమూశారు. నేడు సాయంత్రం ఈయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈయన అంతిమయాత్ర కూడా ప్రారంభమైంది. ఇకపోతే కోటా శ్రీనివాసరావు మరణించిన తర్వాత ఆయన సినీ జీవితానికి సంబంధించి ఎన్నో వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ హీరో కోటా శ్రీనివాసరావును దారుణంగా అవమానించారు అంటూ ఒక వార్త బయటకు వచ్చింది.
రాజమండ్రి హోటల్లో..
ఈ విషయాన్ని స్వయంగా కోటా శ్రీనివాసరావు ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ.. గతంలో తాను రాజమండ్రి(Rajahmundry)లో ఒక హోటల్ లో బస చేశానని అయితే లిఫ్ట్ దగ్గర తాను ఎదురు చూస్తూ ఉండగా కొంతమంది పక్కకు తప్పుకోండి అంటూ సైగలు చేశారు. వాళ్లు ఎందుకు అలా చెబుతున్నారో అర్థం కాలేదు తీరా చూస్తే బాలయ్య అక్కడికి వస్తున్నారు. బాలకృష్ణ(Balakrishna) అక్కడికి రావడంతో కోటా శ్రీనివాసరావు గారు బాలకృష్ణకు ఎంతో మర్యాద ఇస్తూ నమస్కారం పెట్టారట.వెంటనే బాలయ్య కోట ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేశారు. దీంతో తనకు ఏమీ అర్థం కాలేదని, ఆయన ఎందుకు అలా చేశారో తెలియక షాక్ లో ఉండిపోయానని కోట ఇంటర్వ్యూలో తెలియజేశారు.
బాధపరిచిన సంఘటన..
ఆయన ఎందుకలా ప్రవర్తించారో నాకు తెలియలేదు ఆయన ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదని కోటా శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఈ ఘటన తనని ఎంతగానో బాధ పెట్టిందని కోట తెలిపారు. బాలయ్య, కోటా శ్రీనివాసరావు గారి పట్ల కోపంతోనే అలా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. కోటా శ్రీనివాసరావు “మండలాధీశుడు”(Mandaladeesudu) అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో కోటా ఎన్టీఆర్(NTR) పాత్రలో నటించారు. ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ గురించి ఈయన అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈయనని వెంబడించి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలయ్య కూడా కోటా శ్రీనివాసరావు పట్ల ఆ విధంగా వ్యవహరించారని తెలుస్తుంది.
నివాళులర్పించిన బాలయ్య…
ఇక తదుపరి బాలకృష్ణ సినిమాలలో కోటా శ్రీనివాసరావు నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక నేడు కోటా శ్రీనివాసరావు గారి మరణ వార్త వినగానే బాలయ్య కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన మృతికి నివాళులు అర్పించారు. ఇలా కోటా శ్రీనివాసరావు జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని అలాగే ఎన్నో విధాలుగా వివాదాలలో కూడా నిలిచారని చెప్పాలి. కోటా శ్రీనివాసరావు మరణం తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read: Kota Srinivas Rao: 700 లకు పైగా సినిమాలు.. చివరికి అవకాశాలను అడుక్కున్న కోటా?