Sreemukhi: శ్రీముఖి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్న శ్రీముఖి(Sreemukhi) గతంలో బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో భాగంగా ఈమె రన్నర్ గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా మంచి సక్సెస్ అందుకున్న శ్రీముఖి ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. శ్రీముఖి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఈమె సహాయ సహకారాలు గురించి ఇదివరకే అవినాష్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.
కరోనా సమయంలో ఇబ్బందులు…
తాజాగా శ్రీముఖి ఒక ట్రాన్స్ జెండర్ దత్తత తీసుకున్నారని తెలుస్తుంది. మరి శ్రీముఖి దత్తత తీసుకున్న ఆ ట్రాన్స్ జెండర్ ఎవరనే విషయానికి వస్తే.. బిగ్ బాస్3 సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తమన్నా సింహాద్రి(Tamanna Simhadri) గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో ఈమె రెండు వారాలు పాటు కొనసాగారు. అయితే ఈ సమయంలోనే శ్రీముఖి తనకు చాలా మంచి స్నేహితురాలిగా మారిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే తాను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇబ్బందులను ఎదుర్కొన్నాను కరోనా సమయంలో చేతిలో చిల్లిగవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న…
ఇలా ఆర్టిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తాను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కానీ ఆ సమయంలో నన్ను శ్రీముఖి ఆదుకుందని, తనని విజయవాడ నుంచి హైదరాబాద్ రమ్మని చెప్పి అక్కడ తన బాగోగులను చూసుకుంటున్నారని తెలిపారు. కేవలం శ్రీముఖి మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు కూడా తనని సొంత కుటుంబ సభ్యురాలి లాగే భావిస్తున్నారు. నేను ఏ సమయంలో ఏమి ఆలోచిస్తున్నాను? ఎప్పుడు తింటాను? ఏ సమయంలో ఏమి తాగుతాను వాళ్ళందరికీ బాగా తెలుసు. ఇక శ్రీముఖి తమ్ముడు కూడా నన్ను చూడగానే నేనేం ఆలోచిస్తున్నానో ఇట్టే గుర్తుపడతారని తెలిపారు.
శ్రీముఖి నా బిడ్డ లాంటిది…
ఇలా శ్రీముఖి నా బాగోగులను చూసుకుంటూ సొంత బిడ్డ లాగా మారిపోయిందని ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నన్ను దత్తత తీసుకుందని తెలిపారు. నేను ట్రాన్స్ జెండర్ గా మారడంతో తన కుటుంబ సభ్యులు బంధువులు కూడా తనని దూరం పెట్టారు. కానీ శ్రీముఖి తనని దగ్గరకు తీసుకొని ఒక కుటుంబాన్ని ఇచ్చిందని తెలిపారు. అలాగే ఇల్లు కట్టుకుంటున్న సమయంలో కొంత డబ్బును కూడా ఇచ్చిందని,ఈ విషయాలు శ్రీముఖి ఎక్కడా కూడా బయటకు చెప్పలేదు. శ్రీముఖి నా ఒక్కదానికే కాదు ఎంతోమందికి ఇలాంటి సహాయ సహకారాలు చేసిందని, ఇలాంటివన్నీ కేవలం ఆమె చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు అంటూ శ్రీముఖి మంచితనం గురించి తమన్న సింహాద్రి బయట పెట్టడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. నిజంగా ఒక ట్రాన్స్ జెండర్ ను హక్కున చేర్చుకొని ఆమె బాగోగులు చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు శ్రీముఖి నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: The Ba*dsOf Bollywood : కౌంట్ డౌన్ బిగిన్స్.. ది బా*డ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రివ్యూ రిలీజ్.. ఎప్పుడంటే!