E-Paper
Advertisement

ప్యారడైజ్‌లో అసలేం జరుగుతోంది?

ప్యారడైజ్‌లో అసలేం జరుగుతోంది?
Advertisement

Paradise Movie:ప్యారడైజ్.. తెలుగు ఆడియన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా.ఇక దసరా తీసిన శ్రీకాంత్ ఓదెల నాని కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇపుడు ఫిలిమ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఎడిటర్ గా మారిన నాని ?

ప్యారడైజ్ సినిమాకి పని చేస్తున్న ఎడిటర్ నవీన్ నూలిని తీసేశారని అతడి ప్లేసులో నానినే కత్తెర పట్టుకున్నాడన్న వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. సినిమాకి నవీన్ చేస్తున్న ఎడిట్ కట్ నచ్చలేదని, ఇక మొన్నామధ్య వచ్చిన టీజర్ కూడా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో నానీనే రంగం లోకి దిగాడని వినిపిస్తుంది.అదే నిజమైతే మాత్రం అది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే నవీన్ నూలికి ఎడిటర్ గా ఎంత పెద్ద గుర్తింపు ఉందో చెప్పక్కర్లేదు.’జెర్సీ’, ‘రంగస్థలం’, ‘లక్కీ భాస్కర్’ లాంటి ఎన్నో సినిమాలు ఆయన ఖాతాలోనివే .అలాంటి నవీన్ నూలిని కాదని నాని కత్తెర పట్టుకోవడం అంటే అది ఎవరూ ఊహించని నిర్ణయమే.

Advertisement

సినిమా ఇప్పటికే దాదాపు దగ్గర దగ్గర వందకోట్లకి బడ్జెట్ చేరిందని,ఇక సినిమా మరింత బడ్జెట్ డిమాండ్ చేస్తుందని సమాచారం.దీనితో ఊహించని విధంగా బడ్జెట్ పెరిగిపోతుండడం,ఆకారణంగానే సుధాకర్ చెరుకూరి చేతులు ఎత్తేయడంతో నానినే ఫుల్ గా ప్రాజెక్ట్ ని హ్యాండోవర్ చేసుకుని ముందుకు తీసుకువెళ్తున్నాడని తెలుస్తుంది.

ఊహించని మొత్తం చెబుతున్న మేకర్స్ 

ఇక వీటితో పాటు ఈ సినిమాకి సంబందించిన బిజినెస్ వ్యవహారాలు కూడా ఇపుడు వార్తల్లో నిలుస్తున్నాయి.ముఖ్యంగా సినిమాకి ఊహించని మొత్తంలో థియేట్రికల్ రైట్స్ చెబుతున్నారని,ఇక వైజాగ్ లాంటి ఏరియాకి ఏకంగా పదికోట్లని కోట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.నిజానికి నాని సినిమా ఏదీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో కలెక్ట్ చేసిన దాఖలాలు లేవు,మరి మేకర్స్ అంత మొత్తం ఎలా కోట్ చేశారా అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.మొత్తంగా చూస్తే సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ప్యారడైజ్ మరింత గందర గోళంలో పడే అవకాశమే కనిపిస్తుంది.

సెప్టెంబర్ 24న రిలీజ్

Advertisement

ఇక శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు శిఖంజా మాలిక్ అనే విలన్ గా కనిపిస్తుండగా, కయాదు , సంపూ కీలక పాత్రల్లో తళుక్కుమనబోతున్న సంగతి తెల్సిందే.ఇక నానితో దసరా సినిమాలో జోడీ కట్టిన కీర్తి సురేష్ ఇందులో స్పెషల్ సాంగ్ చేయనుండటం ప్యారడైజ్ పై మరింత హైప్ తెచ్చేసింది.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ అవబోతుందని టీజర్ లోనే చెప్పేశారు మేకర్స్ .చూడాలి మరి రిలీజ్ అయ్యేనాటికి సమస్యలన్నీ పరిష్కరించుకొని థియేటర్ లో విజయడంకా మోగిస్తారా లేక ఇన్నర్ వార్ తో సినిమాని ఇబ్బందుల్లోకి నెట్టేస్తారా !

Tags

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×