E-Paper
Advertisement

ప్రజలనే ఆయుధంగా మార్చి దేశాన్ని కూల్చే కుట్ర… విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ప్రజలనే ఆయుధంగా మార్చి దేశాన్ని కూల్చే కుట్ర… విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’ తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే ?
Advertisement

Jana Nayagan on OTT : ఒకప్పుడు పోలీస్ యూనిఫామ్‌లో అవినీతిపై పోరాడిన ఓ వ్యక్తి… అదే వ్యవస్థకు ఎదురు తిరిగి జైలు పాలైతే ? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ యువతికి అండగా నిలిస్తే… ఆమె జీవితంలోకి అడుగు పెట్టిన ఓ ప్రమాదకరమైన వ్యక్తి ఏకంగా దేశ ప్రజాస్వామ్యాన్నే టార్గెట్ చేస్తే ? సోషల్ మీడియా, ఆధునిక టెక్నాలజీ, ప్రజల భయాలను ఆయుధాలుగా మార్చుకుని దేశంలో గందరగోళం సృష్టించేందుకు భారీ కుట్ర జరిగితే ? ఆ కుట్రను అడ్డుకునేందుకు మాజీ పోలీస్ అధికారి మళ్లీ పోరాటంలోకి దిగితే ? ఇదే విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) కథ. మరి వెట్రి కొండన్‌కు ఎదురైన అసలు సమస్య ఏంటి? ప్రజలనే విలన్ ఎలా ఆయుధాలుగా మార్చుకున్నాడు? ఈ సినిమాను తెలుగులో ఎక్కడ చూడొచ్చు? తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

తలపతి విజయ్ ఇందులో వెట్రి కొండన్ అనే మాజీ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. ఒకప్పుడు నిజాయితీగా పని చేసిన అతను వ్యవస్థలోని అవినీతికి ఎదురెళ్లడంతో జైలుకు వెళ్తాడు. అక్కడ జైలర్ శ్రీకాంత్‌తో అతనికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. శ్రీకాంత్ కుమార్తె చిన్నప్పటి విషాద ఘటన కారణంగా పానిక్ అటాక్స్‌తో బాధ పడుతుంటుంది. ఆమెను బలమైన మహిళగా తీర్చిదిద్ది, ఆర్మీలో చేరేలా చేయాలన్నది తండ్రి కల.

Advertisement

జైలు నుంచి బయటకు వచ్చిన వెట్రి… ఆ యువతికి అండగా నిలుస్తాడు. ఆమె భయాలను పోగొట్టి, జీవితంలో ముందుకు వెళ్లేలా శిక్షణ ఇస్తాడు. మొదట్లో ఇదంతా ఓ మాజీ పోలీస్, ఓ యువతి మధ్య అనుబంధం కథలా అనిపిస్తుంది. కానీ అసలు ప్రమాదం మరోవైపు మొదలవుతుంది. జాన్ హిమ్లర్ అనే అంతర్జాతీయ క్రిమినల్ ప్రజల్లో భయాన్ని సృష్టించి, సోషల్ మీడియా, టెక్నాలజీ ద్వారా గందరగోళం పెంచి దేశ వ్యవస్థను అస్థిరపరిచే కుట్ర చేస్తుంటాడు. ప్రజలే ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకునేలా చేయడం అతని ప్రధాన వ్యూహం.

దీంతో వెట్రి పోరాటం ఒక అమ్మాయిని కాపాడటం నుంచి దేశాన్ని కాపాడే స్థాయికి చేరుతుంది. ఇదే సమయంలో జాన్ హిమ్లర్‌తో వెట్రికి ఉన్న పాత సంబంధం కూడా బయట పడుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ ఇద్దరి జీవితాలను ఎలా కలిపాయి ? హిమ్లర్ అసలు లక్ష్యం ఏంటి ? ప్రజల భయాలను ఆయుధాలుగా మార్చిన అతని కుట్రను వెట్రి ఎలా అడ్డుకున్నాడు ? యువతిని ఎలా కాపాడాడు ? అన్నదే సినిమా అసలు కథ.

Advertisement

Also Read : ఓటీటీలోకి తెలుగులో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… కిల్లర్ ఎవరో చివరి వరకు కనిపెట్టలేరు

తెలుగులోనూ చూడవచ్చు

‘జన నాయగన్’ ఆగస్టు 21 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజకీయాల్లోకి వెళ్ళేముందు విజయ్ చివరి సినిమా ఇదే కావడం విశేషం. దీంతో పాటు పొలిటికల్ యాక్షన్, టెక్నాలజీ ఆధారిత కుట్రలు, మాస్ ఎలివేషన్స్ ఉన్న ఈ సినిమాను డోంట్ మిస్.

 

Tags

Related News

వీడియో గేమ్‌ లా మనుషుల ప్రాణాలతో ఆడుకునే దేవుడు… క్రేజీ కాన్సెప్ట్… ఇప్పటిదాకా ఇలాంటి సినిమాను చూసి ఉండరు

తేజ సజ్జ ‘ది ట్రేటర్స్’ తెలుగు ట్రైలర్ చూశారా? 20 మంది సెలబ్రిటీలు వీళ్లే!

నడిసముద్రంలో మిస్సింగ్ షిప్… తలుపు తీసి చూస్తే కళ్లు తేలేసే సీక్రెట్స్…’డార్క్’ మేకర్స్ మైండ్-బెండింగ్ మిస్టరీ

7 ఇయర్స్ మిస్సింగ్… పుట్టుకతో గుడ్డిదైన పిల్ల తిరిగొచ్చేసరికి కంటిచూపుతో… మెంటల్ మాస్ సిరీస్ మావా

దట్టమైన అడవిలో విమానం క్రాష్… బతకడానికి అమ్మాయిలు చేసిన పని చూస్తే ఒళ్లు గగుర్పొడవాల్సిందే

ప్రతిరోజూ ఉదయం 3:33 గంటలకే మెలకువ… సీరియల్ కిల్లర్‌కి, ఈ టైమ్‌కి ఉన్న లింక్ ఏంటి ? తెలుగులోనే స్ట్రీమింగ్

బాబోయ్ 23 ఏళ్లకు ఒకసారి వచ్చే దెయ్యం మళ్లీ వచ్చింది… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సినిమా

డ్రాగన్‌ను కొట్టడానికి కుర్రాడి క్రేజీ జర్నీ… విజువల్స్ పీక్స్ అసలు… ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమా

Big Stories

Advertisement
×