E-Paper
Advertisement

ఆర్మీ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్.. CSD ద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

ఆర్మీ సిబ్బందికి అదిరిపోయే ఆఫర్.. CSD ద్వారా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!
Advertisement

Ather Enters CSD: ఏథర్ ఎనర్జీ ఆర్మీ సిబ్బందికి సూపర్ న్యూస్ చెప్పింది. వచ్చే సెప్టెంబర్ నుంచి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌ మెంట్ (CSD) ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన  అనుమతిని కంపెనీ తీసుకుంది. దీంతో రక్షణ రంగానికి చెందిన అర్హులైన వినియోగదారులు CSD ప్లాట్‌ ఫారమ్ ద్వారా ఏథర్ స్కూటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

CSDలో ఏథర్ స్కూటర్ల అమ్మకం

భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో CSD పనిచేస్తుంది. అర్హులైన సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు వివిధ రకాల ఉత్పత్తులను రాయితీ ధరలకు అందిస్తుంది. వాహనాలు కూడా ఈ లిస్టులో ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ వీలర్ల విభాగంలో ఏథర్ కూడా CSD ద్వారా తన స్కూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది. సెప్టెంబర్ 2026 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రానుంది. CSD ఛానల్ ద్వారా ఏథర్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే అర్హులైన వినియోగదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

ఎనిమిది వేరియంట్లు అందుబాటులోకి!

Advertisement

CSD జాబితాలో ఏథర్ 450 శ్రేణి, రిజ్టా శ్రేణికి చెందిన మొత్తం ఎనిమిది వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఏథర్ 450 సిరీస్‌లో పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చే మోడళ్లు ఉండగా, రిజ్టా ప్రధానంగా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్. అయితే, ఏథర్ 450 అపెక్స్ మాత్రం CSD ద్వారా విక్రయించరు. పనితీరుకు ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రత్యేక మోడల్‌ను CSD జాబితాలో చేర్చలేదు. మిగిలిన ఎంపిక చేసిన 450, రిజ్టా వేరియంట్లు అర్హులైన కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.

కొనుగోలుదారులకు GST రాయితీ

CSD ద్వారా వాహనాలను కొనుగోలు చేసే వారికి వర్తించే GST ప్రయోజనాలు ఉంటాయి. దీంతో అర్హులైన రక్షణ సిబ్బందికి స్కూటర్ కొనుగోలు ఖర్చులో కొంత తగ్గే అవకాశం ఉంటుంది.  దీనికి అదనంగా ఏథర్ కంపెనీ అందించే డిస్కౌంట్లు కూడా వర్తిస్తాయి. అయితే, మొత్తం ప్రయోజనం ఎంత ఉంటుందనేది ఎంచుకునే మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రతి స్కూటర్‌కు ఒకే స్థాయిలో ధర తగ్గింపు ఉండకపోవచ్చు.

తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీల్లో ఏథర్

Advertisement

దేశంలో CSD ప్లాట్‌ఫారమ్‌లో తమ ఉత్పత్తులను లిస్ట్ చేసిన తొలి ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారుల్లో ఏథర్ ఎనర్జీ ఒకటిగా నిలిచింది. ఇది కంపెనీకి కొత్త వినియోగదారులను చేరుకునే అవకాశం కల్పిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో, రక్షణ రంగానికి చెందిన అర్హులైన వినియోగదారులకు ఏథర్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావడం కంపెనీకి ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ విధానం అర్హులైన సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలులో ఉపయోగపడనుంది.

Read Also: చక్రాల్లోనే మోటార్లు.. సైన్స్ ఫిక్షన్ లాంటి బైక్.. హోండా ఈవీ డిజైన్ కు ప్రపంచం ఫిదా!

Tags

Related News

టెస్లాకు చైనా షాక్.. 43 లక్షల కార్ల రీకాల్, అసలేం జరిగిందంటే?

చక్రాలు లేకుండా పరుగులు.. 4 కాళ్లతో నడిచే హైడ్రోజన్ రోబోట్ వచ్చేస్తోంది!

చక్రాల్లోనే మోటార్లు.. సైన్స్ ఫిక్షన్ లాంటి బైక్.. హోండా ఈవీ డిజైన్ కు ప్రపంచం ఫిదా!

కొనుగోలుదారులకు టాటా బిగ్ షాక్.. సెప్టెంబర్ 1 నుంచి ధరలు పెంపు!

పెట్రోల్ స్కూటర్లకు షాక్.. అమ్మకాల్లో ఈవీ స్కూటర్ల జోరు, నంబర్ వన్ ఏదంటే?

కారు విండోకి తెల్లటి గుడ్డ.. ఇది దేనికి సంకేతం? ఒకవేళ కనిపిస్తే ఏం చేయాలి?

బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?

Big Stories

Advertisement
×