Harish Rao: కేసీఆర్ బిక్ష తోనే రేవంత్‌కు సిఎం పదవి వచ్చిందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 29 లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణే లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా అని మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాక్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ తేకుంటే రేవంత్ రెడ్డి ఆంధ్రోళ్ల బూట్ల కాడో, చంద్రబాబు అడుగులో అడుగు వేసుకుంటూ తిరుగుతుండేవాడని అన్నారు.
సిద్దిపేట సభకు 50 కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి.. సిద్దిపేటకు కనీసం 50 పైసలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌కు పొక్క కొట్టి ఆంధ్రకు అప్పజెప్పే కుట్ర.. రాముడి పాలన పోయి రాష్ట్రంలో రాక్షస పాలన వచ్చిందని హరీష్ రావు అన్నారు. నవంబర్ 29 దీక్షా దివస్ అయితే.. డిసెంబర్ 9ని విజయ దివస్‌గా జరుపుకోవాలిని హరీశ్ రావు అన్నారు.
దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ చరిత్రను, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read: ఏపీకి మరో తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! బుధవారానికి వాయుగుండంగా మారే ఛాన్స్