E-Paper
Advertisement

పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!

పెట్రోల్ ధరల మానిటరింగ్ కోసం.. యూకే ప్రభుత్వం సరికొత్త పథకం!
Advertisement

Fuel Prices: పెట్రోల్ ధరలు ఎక్కడ తక్కువ..? డీజిల్ ఏ బంకులో చవకగా దొరుకుతుంది..? ఈ వివరాల కోసం ఇక యూకే వాహనదారులు ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు..! చేతిలో గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు.. దగ్గర్లోని పెట్రోల్ బంకుల ధరలు తెలుసుకోవచ్చు..!

పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు..

బ్రిటన్ ప్రభుత్వం, గూగుల్ కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దగ్గర్లోని పెట్రోల్ బంకు కోసం సెర్చ్ చేస్తే అక్కడ పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు కనిపిస్తాయి. దీంతో వేర్వేరు బంకుల్లో ధరలను పోల్చుకుని.. తక్కువ ధరకు ఇంధనం అందించే బంకును ఎంచుకోవచ్చు. ఈ సదుపాయం వెనుక బ్రిటన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఫ్యూయల్ ఫైండర్’ పథకం ఉంది. అక్కడ పెట్రోల్ బంకులు ధరల్లో మార్పులు జరిగిన 30 నిమిషాల్లోగా కొత్త ధరలను నమోదు చేయడం తప్పనిసరి. ఈ వివరాలనే గూగుల్ మ్యాప్స్‌కు అనుసంధానించారు. నిబంధనలు పాటించని బంకులపై జరిమానాలు విధించే అవకాశం కూడా ఉంది.

ధరల సమాచారం..

Advertisement

ఇప్పటికే వేజ్, ఏఏ, ఆర్‌ఏసీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్న ఇంధన ధరల సమాచారం.. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా మరింత మంది వాహనదారులకు చేరనుంది. ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న బ్రిటన్ వాహనదారులకు.. ఈ ఫీచర్ కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.

Also Read: భయమేస్తోంది అంటున్న విజయ్.. రష్మిక.. బయటకు కనిపించవు సుమీ!

Tags

Related News

సీఎంతో సహా మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా.. రాజగోపాల్ రెడ్డి సంచలన స్కెచ్?

వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో రసవత్తర పోరు.. కొత్త రిజర్వేషన్లతో కడపలో కలవరం!

సీఎం రేవంత్ వ్యూహానికి తట్టుకోలేకపోతున్నారా.. సిరిసిల్ల, సిద్దిపేటలో మారుతున్న పొలిటికల్ సీన్?

పాముతో పెళ్లి, నదిలో అద్భుతం.. బతుకమ్మ పాటల్లో ఆ పేర్లలో ఉన్న రహస్యం ఇదే!

పుష్కరకాలంలో యువత యూటర్న్‌..! మోడీ అప్పుడు కొత్త ఓటర్ల పాలిట హీరో..! అందుకే నెత్తినెత్తుకున్నారు.. ఇప్పుడెందుకు వైఖరి మారింది? సీఎస్‌డీఎస్‌ ఆసక్తికర విశ్లేషణ..!

బీజేపీలో బతుకమ్మ రాజకీయ మంటలు.. మరోసారి భగ్గుమన్న నేతల ఆధిపత్య పోరు!

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సీపీఎం పార్టీ సై.. ఈ జిల్లాలపై స్పెషల్ ఫోకస్!

Big Stories

Advertisement
×