E-Paper
Advertisement

మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!

మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!
Advertisement

Women’s Quota: తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మహిళలకు 50 శాతం కోటా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ వేడుకలు బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ అందరితో పాటలు పాడిస్తూ బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా బతుకమ్మ విశిష్టత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పండుగ ద్వారా మహిళలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఎంతలా కృషి చేశామో వివరించారు.

అనంతరం గౌరమ్మకు పూజలు చేసి మహిళా నాయకులతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళలు, బహుజనుల కోసం పాటు పడుతున్న తనను ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా.. రిజర్వేషన్లు అమలు చేసినా, చేయకున్నా తమ పార్టీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 50 శాతం సీట్లను మహిళలకు ఇస్తుందని ప్రకటించారు.

Advertisement

Also Read: బిహార్ ఓటర్ల జాబితా వివాదం.. ఈసీకి బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు!

రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి పార్టీ ఆఫీస్ లో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగ మన తెలంగాణ సొంతమని అన్నారు. ప్రపంచానికి చాటేలా ఈ పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బతుకమ్మ పాటలు నేర్చుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలని సూచించారు. బతుకమ్మ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి బతుకమ్మ ప్రతీకగా నిలిచిందని గుర్తు చేశారు. గౌరమ్మ తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Also Read: నా పెళ్లి నిర్ణయం అతని చేతుల్లోనే… పెళ్లి వార్తలపై మమిత క్రేజీ రియాక్షన్!

Tags

Related News

ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!

ఉక్రెయిన్ యుద్ధంలో జగిత్యాల వాసి మృతి.. కుటుంబాన్ని ఆదుకున్న సీఎం రేవంత్!

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!

వంట చేస్తుండగా పేలిపోయిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లో యువకుడు..?

మీ మొబైల్లో వాట్సాప్‌కి YES or NO అని మెసేజ్ వస్తుందా.. అయితే బీ కేర్ ఫుల్..?

ఉప్పల్‌లో ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు.. పోలీసుల గైడ్‌లైన్స్ ఇవే!

రైతులు ఇబ్బంది పడుతుంటే మంత్రులు గోవా, ఢిల్లీ ట్రిప్పులా?: హరీశ్‌రావు

Big Stories

Advertisement
×