Anaya Bangar : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా పురుషులు, మహిళలు ఇద్దరూ కూడా క్రీడా రంగాల్లో రాణిస్తున్నారు. అయితే తొలుత కేవలం ప్రతీ క్రీడాను కేవలం పురుషులు మాత్రమే ఆడేవాడు. రాను రాను స్త్రీలు కూడా తాము పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఇదే సందర్భంలో ఓ ఆసక్తికర ఘటన గురించి గుర్తు చేయాలండోయ్. అదేంటో కాదు.. అనయ బంగర్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఆమె తన మనస్సులో ఉన్నటువంటి మాటలను బయటపెట్టింది. ఓ వెటరన్ క్రికెటర్ చెప్పిన మాటలను గుర్తు చేసింది. ఒకానొక దశలో ఆయన ‘స్లీప్ విత్ మి’ అని వ్యాఖ్యానించారని వెల్లడించింది. తాజాగా ఆమె ట్రాన్స్ జెండర్లకు కూడా క్రికెట్ ఆడే అవకాశం ఇవ్వాలని ఐసీసీకి రిక్వెస్ట్ పెడుతోంది. అలా చేయడం వల్ల క్రికెట్ ఆడాలనే తన కోరిక నెరవేరుతుందని పేర్కొంది అనయ్ బంగర్. ప్రస్తుతం ఆమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన కొడుకు ఆర్యన్ ఈ మధ్య అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటోంది. ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. తండ్రి సంజయ్ మాదిరిగా అనయ క్రికెటర్ కావాలని భావించింది. ఆర్యన్ గా ఉన్న సమయంలో దేశ వాళీ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఆ తర్వాత ఐసీసీ నిర్ణయంతో ఆటకు దూరమైంది. రెండేళ్ల కిందట అంటే.. 2023 నవంబర్‌లో మహిళ క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్‌లకు అవకాశం లేదని ఐసీసీ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చింది. దీంతో ఆటకు దూరమైంది అనయ. తాను అమ్మాయిగా ఉండాలని అనుకున్నానని మనసులోని మాట బయపెట్టింది.తాను అబ్బాయిగా ఉన్న సమయంలో క్రికెట్ ఆడానని తెలిపింది.
ప్రస్తుత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ వంటి వారితో క్రికెట్ ఆడానని గుర్తు చేసింది. మా నాన్న అందరికీ తెలిసిన క్రికెటరని చెబుతూనే క్రికెట్ ప్రపంచం అభద్రత, విషపూరిత, పురుషత్వంతో నిండి ఉందని ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలో కొందరు క్రికెటర్లు తనకు అసభ్యకరమైన ఫొటోలు పంపేవారు వివరించింది. తరచూ న్యూడ్ ఫొటోలు పంపి వేధించేవారని గుర్తు చేసింది. సరైన జెండర్‌గా లేనని ఎప్పుడు అనిపించిందన్న ప్రశ్నకు అనయ రిప్లై ఇచ్చింది. ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మహిళల దుస్తులు ధరించి అద్దంలో చూసుకున్నానని తెలిపింది. ఈ విషయం తెలిశాక ఒకప్పటి సహచర క్రికెటర్లు ఎలా స్పందించారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది అనయ. కొందరు తనకు మద్దతుగా నిలిచారని, మరికొందరు వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయం తెలిశాక ఒకప్పటి సహచర క్రికెటర్లు ఎలా స్పందించారన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది అనయ. కొందరు తనకు మద్దతుగా నిలిచారని.. మరికొందరు వేధింపులకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేసింది.