E-Paper
Advertisement

Tollywood: కృష్ణ మొదలు చిరు వరకు.. ఒకే ఏడాది అత్యధిక చిత్రాలు రిలీజ్ చేసిన హీరోలు వీరే!

Tollywood: కృష్ణ మొదలు చిరు వరకు.. ఒకే ఏడాది అత్యధిక చిత్రాలు రిలీజ్ చేసిన హీరోలు వీరే!
Advertisement

Tollywood:సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఒకేసారి వరుసగా రెండు, మూడు సినిమాలను ఒప్పుకుంటారు. అయితే ఆ సినిమాలను పూర్తిచేసే లోపు దాదాపు 4, 5 సంవత్సరాలు పడుతుంది. కానీ ఒకప్పుడు హీరోలు ఒకే ఏడాదిలో ఏకంగా 10,15 సినిమాలు చేసిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. ఓకే సంవత్సరం 18 సినిమాలను కూడా విడుదల చేసిన హీరోలు ఉన్నారు. అలా అప్పట్లో చాలా మంది స్టార్ హీరోలు రోజులో ఏకంగా మూడు, నాలుగు షిఫ్టుల్లో పనిచేసేవారు. కానీ ఇప్పటి హీరోలు ఒక సినిమా చేసుకుంటూ మరో సినిమా షూటింగ్లో జాయిన్ అయితేనే ఆ సినిమా ప్లాఫ్ అవ్వడానికి కారణం ఈ హీరో రెండు సినిమాలను ఎంచుకోవడమేనని.. రెండు పడవల ప్రయాణం చేయడం వల్లే ఆ హీరో నటించిన సినిమా ఫ్లాఫ్ అయింది అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు.

ఓకే ఏడాది అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు..

Advertisement

కానీ అప్పటి హీరోలు మాత్రం ఏకంగా 10,15 సినిమాలు ఒకే సంవత్సరంలో చేసేవారంటే అప్పట్లో వాళ్ళ డెడికేషన్ ఎలా ఉండేదో..డైరెక్షన్ విభాగం ఎలా పనిచేసేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఒకే సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేసిన ఆ హీరోలు ఎవరు? ఒకే సంవత్సరంలో వాళ్లు నటించిన ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కృష్ణ రికార్డును బ్రేక్ చేసేవారే లేరా?

Advertisement

సీనియర్ ఎన్టీఆర్(Sr. NTR) మొదలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ (Balakrishna) వరకు ఒకే సంవత్సరంలో మూడు, నాలుగు కంటే ఎక్కువ సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు. ఇక వీరందరిలో టాప్ ప్లేస్ లో ఉండేది సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna).. సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR), ఏఎన్నార్(ANR) తర్వాత వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ ఒకే ఏడాదిలో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు.ఇప్పటివరకు ఇలా ఒక్క సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసిన హీరోగా ఎవరికి పేరు లేదు. అలాంటి రికార్డుని సూపర్ స్టార్ కృష్ణ తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు ఈయన 1964 నుండి 1995 వరకు 10 సంవత్సరాలలో ఓ 100 సినిమాలు చేసి 300 సినిమాలు ఫినిష్ చేశారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ తర్వాత నందమూరి తారక రామారావు ఏడాదిలో ఒకేసారి 17 సినిమాలు చేసి కృష్ణ తర్వాత ప్లేస్ లో నిలిచారు.

అప్పటి తరం హీరోలకే సాధ్యం..

ఇక కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మూడో ప్లేస్ లో అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageshwar Rao) ఓకే ఏడాదిలో 16 సినిమాలు చేశారు.. ఆ తర్వాత వరుసగా శోభన్ బాబు (Sobhan Babu) 14 సినిమాలు,చిరంజీవి (Chiranjeevi) 14 సినిమాలు, బాలకృష్ణ 9 సినిమాలు,వెంకటేష్ (Venkatesh) 6 సినిమాలు,నాగార్జున (Nagarjuna) 5 సినిమాలు రిలీజ్ చేశారు. ఇలా ఒకే ఏడాదిలో కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు,చిరంజీవి వంటి హీరోలు పదికి పైగా సినిమాలు రిలీజ్ చేస్తే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు 5 కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఇది సాధ్యం కాదు. ఒక హీరో ఒక ఏడాదిలో కేవలం ఒక్క సినిమానే చేస్తున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ తో స్టార్ డైరెక్టర్లతో చేసే సినిమాలు అయితే కనీసం మూడు నాలుగు సంవత్సరాల టైం పడుతుంది.

ALSO READ:Prabhas: ఇదెక్కడి అభిమానం రా బాబు.. పంజాబ్ ప్రజలు ప్రభాస్ కోసం ఏం చేశారో తెలిస్తే షాక్!

Related News

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

Big Stories

Advertisement
×