E-Paper
Advertisement

Show Time Trailer: దృశ్యం సినిమాను తలపిస్తున్న షో టైమ్.. భార్యాబిడ్డల కోసం హీరో పోరాటం

Show Time Trailer: దృశ్యం సినిమాను తలపిస్తున్న షో టైమ్.. భార్యాబిడ్డల కోసం హీరో పోరాటం
Advertisement

Show Time Trailer: అందాల రాక్షసి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నవీన్ చంద్ర.. హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో నటిస్తూ బిజీగా మారాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఈ నెలలోనే నవీన్ చంద్ర నటించిన లెవెన్, బ్లైండ్ స్పాట్  రెండు సినిమాలు రిలీజ్  అయ్యాయి. థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా ఓటీటీలో మాత్రం ఆ సినిమాలు దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా లెవెన్ సినిమా క్రైమ్ థ్రిల్లర్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అని చెప్పొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.

 

Advertisement

ఇక ఈ రెండు సినిమాలు కాకుండా నవీన్ చంద్ర మరో సినిమాను కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. అదే షో టైమ్. నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన ఈ సినిమాకు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను  స్కై లైన్ మూవీస్ బ్యానర్ పై  కిశోర్ గరికపాటి నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నరేష్, రాజారవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా షోటైమ్  ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

 

Advertisement

షో టైమ్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సూర్య తన భార్య, కూతురుతో హ్యాపీగా నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు తన ఇంటికి సూర్య  ఫ్రెండ్ వస్తాడు. అతను వెళ్లే ముందు తన కూతురు మెడలో ఉన్న చైన్ ను లాక్కొని పారిపోతుండగా సూర్య పట్టుకొని వెనక్కి  తోస్తే గోడకు తగిలి అతనుచనిపోతాడు. ఇక ముందే పోలీసులకు చెప్పకుండా సూర్య లాయర్ వరదరాజులు సహాయం తీసుకుంటాడు. లాయర్ వరద రాజులు.. ఈ కేసు నుంచి సూర్యను బయట పడేస్తాడా.. ? నిజంగా అక్కడ జరిగింది దొంగతనమేనా.. ? సూర్య అతని భార్య పోలీసుల దగ్గర దాస్తున్న నిజం ఏంటి.. ? పోలీసులకు – సూర్యకు మధ్య జరిగిన గొడవ ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

ట్రైలర్ లో పూర్తి కథను రివీల్ చేయకుండా ఎంతవరకు ఆసక్తి రేపాలో అక్కడవరకే కట్ చేసిన విధానం బావుంది.   ఈ సినిమాలో కూడా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఉన్నట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లే  ఆ వ్యక్తిని చంపడం, హీరో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తానే హత్య చేసినట్లు చెప్పడం.. ఇలాంటివి దృశ్యం సినిమాలో ఆల్రెడీ చూపించేశారు. కానీ, ఇక్కడ ఏదో పెద్ద ట్విస్ట్ ఉందని ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా మారనుంది. ఇక ఈ సినిమాకు శ్రీనివాస్ గవిర్రెడ్డి డైలాగ్స్ అందించాడు. శుభం సినిమాలో ఒక హీరోగా నటించిన శ్రీనివాస్.. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించాడు.  జూలై 4 న షో టైమ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నవీన్ చంద్ర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

 

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×