BigTV English

Tollywood: 50 సెకండ్ల యాడ్ కోసం రూ.5 కోట్లు.. ఈమెకు స్టార్ హీరోలకు మించి డిమాండ్!

Tollywood: 50 సెకండ్ల యాడ్ కోసం రూ.5 కోట్లు.. ఈమెకు స్టార్ హీరోలకు మించి డిమాండ్!

Tollywood:ఈ మధ్యకాలంలో హీరోలు ఎలా అయితే వరుస సినిమాలతో విజయాలు అందుకుంటూ.. స్టార్ స్టేటస్ అందుకుంటున్నారో.. హీరోయిన్లు కూడా అదే రేంజ్ లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందరికీ ఇది సాధ్యపడదు అని చెప్పవచ్చు. కొంతమంది తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి.. ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే అలాంటి జాబితాలో ఒక హీరోయిన్ ఏకంగా స్టార్ హీరోలకు మించి డిమాండ్ కలిగి ఉండడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు చేరువ అవుతున్నా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే చలామణి అవుతూ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమె మరో రికార్డు అందుకుంది. కేవలం 50 సెకండ్ల యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.. ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara).


సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార..

తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. మొదట యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆసక్తి లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నేడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi), రజినీకాంత్(Rajinikanth ), షారుక్ ఖాన్ (Shahrukh Khan), మోహన్ లాల్ (Mohan lal) వంటి పాన్ ఇండియా స్టార్లతో కలిసి సినిమాలు చేస్తున్న ఈమె.. తెలుగు, తమిళ్ భాషలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ మధ్యనే బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టిన ఈమె.. షారుక్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేసి రూ.1000 కోట్ల క్లబ్లో చేరి అటు నార్త్ లో కూడా స్టార్ హీరోయిన్ గా స్థానాన్ని నిలబెట్టుకుంది.


చిరు మూవీ కోసం దిగొచ్చిన నయనతార..

ఇక ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న ‘#మెగా 157’ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మొన్నటి వరకు దాదాపు రూ.13 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న నయనతార.. ఇప్పుడు చిరు మూవీ కోసం సగానికి పైగా తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకొని రూ.6కోట్లకు ఒప్పుకుంది. అంతేకాదు మొదటిసారి ఈ సినిమా కోసం తన రూల్స్ అండ్ కండిషన్స్ పక్కన పెట్టి మరీ ప్రమోషన్స్ చేపట్టిన విషయం తెలిసిందే.

50 సెకండ్ల యాడ్ కోసం ఐదు కోట్లు..

ఇదిలా ఉండగా నయనతారకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా రెమ్యూనరేషన్ విషయంలో ఇప్పటివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా తీసుకుంటారనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఆపోహను నయనతార చెరిపివేసింది. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న ఈమె ఆ మధ్య కాలంలో చేసిన ఒక 50 సెకండ్ల టీవీ ప్రకటన కోసం ఏకంగా ఐదు కోట్ల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇదే హై ఎండోర్స్మెంట్ డీల్ అని.. టాటా స్కై కోసం నయనతార చేసిన ఈ ప్రకటనలో ఈ రేంజ్ లో ఆమె రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికైతే నయనతార రేంజ్ ఇప్పుడు స్టార్ హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ రెమ్యూనరేషన్ వివరాలపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Related News

Betting App Case: ఈ రోజు మంచు లక్ష్మీ వంతు… విచారణపై ఉత్కంఠ!

Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

The Raja Saab :ప్రభాస్ సినిమాపై హైకోర్టులో కేసు… 218 కోట్ల మోసం?

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అకౌంట్ లోకి మరో బిగ్ బ్రాండ్..

War 2 : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆ

Big Stories

×