PM Vidyalaxmi: మీకు ఉన్నత చదువులు చదువుకోవాలని ఉందా? టాలెంట్ ఉండి కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల పైచదువులకు వెళ్లలేకపోతున్నారా? ప్రతిభ ఉండి కూడా ఉన్నత విద్య కొనసాగించలేకపోతున్నారా? ఇలాంటి వారి కోసం సెంట్రల్ గవర్నమెంట్ అత్యద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. అదే పీఎం విద్యాలక్ష్మీ స్కీం 2025 (PM Vidyalaxmi Scheme 2025)
ఈ స్కీం ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.7లక్షల 50వేలు విద్యారుణం తీసుకోవచ్చు. అంతేకాకుండా.. 3 శాతం వడ్డీ సబ్బిడీ కూడా అప్లై అవుతోంది. ఇలాంటి మంచి అవకాశాన్ని టాలెంట్ ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోంటే బంగారం భవిష్యత్తు మీ సొంతమవుతోంది. ఈ స్కీం విద్యార్థులకు ఒక వరం లాంటిదని చెప్పవచ్చును.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులే ప్రధాన లక్ష్యం
ఇది విద్యార్థుల కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన విద్యా రుణ పథకం. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా కేంద్రం ప్రభుత్వం రూపొందించింది. ఆర్థిక ఇబ్బందులతో పైచదువుల కొనసాగినవారికి లోన్ అందించడమే ఈ స్కీం ప్రధాన లక్ష్యం. నామమాత్ర వడ్డీతో రుణం అందించడం ఈ స్కీం లక్ష్యం.
ఈ అర్హతలు ఉండాలి..
ఈ స్కీంకు అప్లై చేసుకునే స్టూడెంట్స్ కచ్చితంగా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. ఎన్ఐఆర్ఎఫ్ లోని టాప్ 860 హాయర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ లో చేరాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసే వారికి అప్లికేబుల్ అవుతోంది. రూ.8లక్షల లోపు వారికి వడ్డీ సబ్సిడీ లభ్యమవుతోంది.
ఎలాంటి పూచీకత్తు లేకుండా..
మొత్తం రూ.7లక్షల 50వేల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా లోన్ తీసుకోవచ్చు. వడ్డీపై 3 శాతం సబ్బిడీ ఉంటుంది. దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థలపై మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతోంది. ఎట్ ఏ టైం మూడు విభిన్న రుణాలకు ఇది వర్తిస్తోంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
అధికారక పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయాలి. ముందుగా సీఈఎల్ఏఎఫ్- కామన్ ఎడ్యుకేషనల్ లోన్ అప్లికేషణ్ ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. అందులో కోర్సు, విద్యార్థి అర్హతలను నింపాలి. ఎంత లోన్ కావాలి ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గడిచిన ఇయర్ సెమిస్టర్ మార్కులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, కాలేజ్ అడ్మిషన్ లెటర్, ఫీజు స్ట్రక్చర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి.
స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు..
అప్లికేషన్ చేసిన తర్వాత ఓ నంబర్ వస్తుంది. దాని ద్వారా విద్యా లక్ష్మీ పోర్టల్ లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అప్రూవల్ ప్రకారం ఎప్పటికప్పుడు స్టేటస్ లో అప్డేట్ అవుతోంది.
బంగారు భవిష్యత్తు కోసం అద్భుతమైన స్కీం మీకోసం..
ఇలాంటి అద్భుతమైన పథకంతో విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించవచ్చు. ఆర్థిక పరిస్థితులు బాగా లేని స్టూడెంట్స్ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బంగారు భవిష్యత్తు కోసం లోన్ కు వెంటనే అప్లై చేసుకోండి.
ALSO READ: NHPC Recruitment: గుడ్ న్యూస్.. ఎలాంటి పరీక్ష లేకుండా ఉద్యోగం.. జస్ట్ ఈ అర్హత ఉంటే చాలు
ALSO READ: Yellow Fruits And Vegetables: పసుపు రంగు పండ్లు, కూరగాయలు.. డైట్‌లో చేర్చుకుంటే మతిపోయే లాభాలు