Simarjeet Singh : సన్ రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ సిమర్ జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 వేలంలో SRH ప్లేయర్ సిమర్ జిత్ సింగ్ రిషబ్ పంత్, నితీష్ రాణాల కంటే ఎక్కువగా కాసులు సంపాదించడం విషశేషం. ఇతను గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇతన్ని ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సెంట్రల్ ఢిల్లీ అత్యధిక ధర రూ.39 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం. ఇక ఇతనితో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కి ఆడిన స్పిన్నర్ దిగ్వేష్ రతి రూ.38లక్షలకు, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు నితీష్ రాణా రూ.34లక్షలకు వేలంలో దక్కించుకున్నాయి. ఔటర్ ఢిల్లీ వారియర్స్, న్యూ ఢిల్లీ టైగర్స్ రెండు కొత్తవి.. నార్త్ ఢిల్ట్రీ స్ట్రైకర్స్, సెంట్రల్ తో కూడిన లీగ్ లో చేరాయి.
ఈసారి కొత్త టీమ్ లు ఎంట్రీ..
ఈ సారి టీమ్ లను పరిశీలించినట్టయితే.. ఢిల్లీ కింగ్స్, పురాణి ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్, సిమర్జిత్ సౌత్ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ నుంచి బిడ్లను ఆకర్షించింది. దిగ్వేష్ అనేక ఫ్రాంచైజీలకు ఆకర్షణీయమైన అవకాశముంది. ముఖ్యంగా దిగ్వేష్ ని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్, పురాణి ఢిల్లీ దిగ్వేష్ కోసం హోరా హోరీగా పోటీ పడ్డాయి. అయితే చివరికీ సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ దిగ్వేష్ ని కొనుగోలు చేసింది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ కోసం రిషబ్ పంత్ పురాణి ఢిల్లీతో కలిసి ఉంటాడు. ఇక జాతీయ జట్టు షెడ్యూల్ ని పరిగణలోకి తీసుకుంటే.. అతను ఏదైనా ఆటలకు అందుబాటులో ఉంటాడా..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
అద్భుతమైన ప్రతిభ.. భారీ ధర..!
ఐపీఎల్ 2025 సీజన్ లో పలువురు ఆటగాళ్లు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. వారిలో ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, సిమర్ జిత్ సింగ్, రిషబ్ పంత్, నితీష్ రాణా వంటి క్రికెటర్లు రాణించారు. వీళ్లు ఢిల్లీ లీగ్ వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయారు. DPL అందించిన అవకాశాల ద్వారా దిగ్వేష్ రతి, ప్రియాంశ్ ఆర్య వంటి చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో రాణిస్తున్నారు. ఇక ఐపీఎల్ లో రాణించడం ద్వారా టీమిండియా జట్టులో చోటు సంపాదించుకుంటున్నారు. కొంత మంది అండర్ -19 ఆటగాళ్లు ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఉదాహరణకు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున 2025 సీజన్ కి ఐపీఎల్ లో ఆరంగేట్రం చేశాడు. ఆరంగేట్రంలోని తొలి మ్యాచ్ తొలి బంతికే సిక్సు బాదాడు. ఇక ఆ తరువాత టీమిండియా తరపున తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అతి పిన్న వయస్కుడిగా భారత్ తరపున పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఇలాంటి లీగ్ ద్వారా కొందరూ ఆటగాళ్లు తమ టాలెంట్ ని బయటపెడుతున్నారు.