NBK vs Pawan Kalyan: సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతోంది అంటే.. మిగతా స్టార్ హీరోలు కూడా తమ కంటెంట్ ను బట్టి ఆ సినిమా విడుదల చేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు విడుదలకు సిద్ధమైతే.. ఇక ఆరోజు థియేటర్లలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే టాలీవుడ్ లో ఎదురుకాబోతోందని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna ) దసరా సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు సినిమాలు కూడా వాయిదా పడబోతున్నాయి.
సెప్టెంబర్ కాదు డిసెంబర్లో వార్..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24వ తేదీన విడుదల కాబోతోంది. ఇక సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న OG సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతున్నట్లు సమాచారం. మరోవైపు నటసింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna ) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం బాలకృష్ణ నుంచి రాబోతున్న చిత్రం ‘అఖండ 2’. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది అంటూ మొదట్లో మేకర్స్ ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలకృష్ణ అంటూ అప్పట్లోనే అభిమానులు వార్తలు వైరల్ చేశారు.
ఒకే రోజు తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్ – బాలయ్య..
అయితే ఇప్పుడు బాలకృష్ణ తన అఖండ 2 సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకునే లోపే మరో హాట్ బాంబ్ లాంటి వార్త అభిమానులలో వార్ కలిగించే కనిపిస్తోందని సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమా కూడా డిసెంబర్ కి వాయిదా పడబోతుందని, అటు పవన్ కళ్యాణ్ OG, ఇటు బాలకృష్ణ అఖండ 2 రెండు సినిమాలు డిసెంబర్లో ఒకేరోజు విడుదల కాబోతున్నట్లు సమాచారం.
యుద్ధం అనివార్యమా?
ఇక దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలకృష్ణ వార్ తప్పేలా లేదు అని.. ఒకే రోజు అంటే అటు మెగా అభిమానులు ఇటు నందమూరి అభిమానుల మధ్య వారు పీక్స్ కి వెళ్ళిపోవడం ఖాయమని.. అప్పుడే సినీ ప్రేమికులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ:Samantha: మీరెప్పుడూ నా హృదయంలోనే ఉంటారు.. స్టేజ్ పై సమంత ఎమోషనల్!