Vizag City: విశాఖ నగరాన్ని ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ గా పిలుస్తారు. అందమైన నగరానికి ఓ వైపు బీచ్‌లు, ఇంకోవైపు ఎంతైన కొండలు, చారిత్రక ప్రదేశాల కలయికతో కలిసి ఉంటుంది. బీచ్ రోడ్డు, కైలాసగిరి వంటి ప్రదేశాలు నగరానికి సహజ సౌందర్యానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పచ్చని కొండల మధ్య విస్తరించి ఉన్న ఈ నగరానికి ‘ఈస్ట్ కోస్ట్ గేమ్’ అనే బిరుదు కూడా ఉంది. తూర్పువైపు రక్షణ, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఎంతో ప్రాధాన్యం కలిగిన నగరం కూడా.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీకి ప్రధాన స్థావరంగా మారుతోంది. ప్రధాన ఐటీ కంపెనీలు అక్కడి నుంచి తమ కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం వారి ఎంచుకున్న ప్రాంతాల్లో భూములను కేటాయిస్తోంది. ఐటీ ప్రధాన సెంటర్‌గా ఉన్న మధురవాడలో భారీ నివాస భవనాలు అంతా రెడీ అవుతోంది.
మధురవాడ సమీపంలో నాలుగున్నర ఎకరాల్లో భారీ ఎత్తైన టవర్లను నిర్మించనున్నారు. ఒకటీ రెండుకాదు.. ఏకంగా ఆరు టవర్లు నిర్మాణం జరగనుంది. ఒక్కో టవర్ 50 అంతస్తులుంటాయి. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ-వీఎంఆర్‌డీఏ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రోజుల కిందట వీఎంఆర్‌డీఏ ఛైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
మధురవాడలో నిర్మించే ఐకానిక్ భవన సముదాయాన్ని ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యం(PPP)తో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. మూడు, నాలుగు పడక గదులతో నిర్మాణం జరగనుంది. ఈ టవర్లు చుట్టూ ఉండే సదుపాయాల గురించి చెప్పనక్కర్లేదు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ ఫూల్, ప్లే గ్రౌండ్, సైకిల్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ వంటి వసతులు ఉండనున్నాయి.
ALSO READ: ఫీజు కట్టలేదని కాలేజీలో వేధింపులు చివరకు
మిథిలాపురి కాలనీ, మధురవాడ, మారికవలస, వేపగుంట ప్రాంతాల్లో గుర్తించిన స్థలాల్లో మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా రెండు, మూడు పడక గదులతో ఆయా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేలా అనుమతి ఇచ్చింది. ఈ టవర్స్ విశాఖ సిటీకి మరింత వన్నె తెస్తాయని అంటున్నారు. సిటీలో ఎల్ఐసీ భవనం తప్పితే చెప్పడానికి ఆ స్థాయి భవనాలు లేవని అంటున్నారు.
యారాడతోపాటు మిగతా హిల్స్ ఏరియాలో ఓ మోస్తరు భారీ భవనాలు ఉన్నాయని అంటున్నారు. ఈ టవర్స్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంటున్నారు. ఆ ప్రాంతం మీదుగానే భోగాపురం ఎయిర్‌పోర్టు వెళ్లాల్సి ఉంటుంది. మెట్రో రైలు కూడా రాబోతోంది. ఆ టవర్స్‌ను రెండే లేదా మూడేళ్లలో పూర్తి చేయాలన్నది వీఎంఆర్‌డీఏ ఆలోచన.