E-Paper
Advertisement

ఆ యాంగిల్లో ఫొటోలా? లైవ్‌లోనే కెమెరామెన్లకు క్లాస్ పీకిన స్టార్ హీరోయిన్!

ఆ యాంగిల్లో ఫొటోలా? లైవ్‌లోనే కెమెరామెన్లకు క్లాస్ పీకిన స్టార్ హీరోయిన్!
Advertisement

Neha Dhupia: సెలబ్రిటీల ప్రైవసీ రైట్స్ చుట్టూ జరుగుతున్న డిబేట్ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది.ఈ డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ప్రైవసీ పెద్ద క్వశ్చన్  మార్క్ అయిన ఈ సమయంలో తమను కెమెరాలు ముందు ఎలా ప్రజెంట్ చేయాలనే దానిపై సరికొత్త రూల్స్ పెట్టేస్తున్నారు హీరోయిన్స్.ఈమధ్య పెద్ది సినిమాలో జాహ్నవి కపూర్ గ్లామర్ ప్రజెంటేషన్ పై నేషనల్ వైడ్ గా పెద్ద డిబేట్ నడిచిన సంగతి తెలిసిందే.సరిగ్గా ఈ సమయంలోనే రిపోర్టర్స్,ఫోటోగ్రాఫర్ ల ప్రవర్తనపై ఘాటుగా స్పందించింది బాలీవుడ్ వెటరన్  బ్యూటీ నేహదూపియా.

హీరోయిన్ పట్ల ఇలాంటి పనులు చేయొద్దు

ముంబైలో జరిగిన ఒక ప్రెస్టేజియస్  ఈవెంట్లో ఆమె డైరెక్ట్ గా కెమెరాల ముందే తన కోపాన్ని ప్రదర్శిస్తూ అందరికీ గట్టిగా క్లాస్ పీకింది .వెనుక వైపు నుంచి అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీయడం ఆపేయండి నా విషయంలోనే కాదు ఏ హీరోయిన్ పట్ల కూడా ఇలాంటి పనులు చేయొద్దు .మేము బ్యాగులు సర్దుకుంటున్నప్పుడు, పుస్తకాలు తీసుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు వెనక నుంచి కెమెరాల తో షూట్ చేయడం ఏం పద్ధతి ,ఇలా చేయొద్దని చెప్పినా మీరు అసలు మారట్లేదు మీకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మీరు కూడా అలాగే ఉండాలి అంటూ ఫైర్ అయింది.

Advertisement

అయితే ఈ వెటరన్  బ్యూటీ  ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడం వెనుక ఒక స్ట్రాంగ్ రీసన్ ఉంది.ఈ మధ్య ఈ అమ్మడు రన్నింగ్ ట్రాక్ పై  వర్క్ అవుట్ చేస్తుండగా కొందరు కెమెరామెన్లు వెనక  నుంచి తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయ్యాయి.వాటిపై నెటిజన్లు అసభ్యకరంగా కామెంట్లు చేశారు కూడా.దాంతో దాన్ని మనసులో ఉంచుకుని నేహా ఈ ఈవెంట్లో అందరికీ క్లాస్ పీకింది.

టాలీవుడ్ నుండే సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ

ఇక నేహదూపియా కెరీర్ విషయానికొస్తే మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకొని మోడలింగ్ రంగంలో టాప్ మోడల్ గా  ఎదిగిన ఈ అమ్మడు టాలీవుడ్ నుండే సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.తరుణ్ హీరోగా 2003లో విడుదలైన నిన్నే ఇష్టపడ్డాను సినిమాతోనే నేహా ధూపియ కెరీర్ మొదలెట్టింది.ఇక అదే ఏడాది ఖయామత్..సిటీ అండర్ థ్రెట్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టి ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించేసింది.

Advertisement

Also read :యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. వెండితెరపై హీరోయిన్ ఛాన్స్.. అయినా దానికి నో చెప్పిన నాగదుర్గ!

వార్నింగ్ ఏమైనా పని చేస్తుందో లేదో !

ఆ తర్వాత ‘క్యా కూల్ హై హమ్’ (2005), ‘చుప్ చుప్ కే’ (2006), ‘ఏక్ చాలిస్ కీ లాస్ట్ లోకల్’ (2007), ‘సింగ్ ఈజ్ కింగ్’ (2008), ‘దే దనా దన్’ (2009), ‘తుమ్హారి సులు’ (2017) మరియు ‘ఏ థర్స్‌డే’ (2022) వంటి డిఫరెంట్ ఫిలిమ్స్ తో నటిగా తన ముద్ర వేసింది .ఇక హిందీలోనే కాకుండా తెలుగులో విలన్ బాలకృష్ణకి జోడిగా పరమ వీర చక్ర  సినిమాలో మెరిసింది ఇలా ఒక పక్క వెండితెర మీద స్పెషల్ సాంగ్స్ చేస్తూ, మరోవైపు బుల్లితెరపై రియాల్టీ షో లకు జడ్జిగా హోస్ట్ గా అలరించే పనిలో పడింది ఈ వెటరన్ భామ.చూడాలి మరి ఆ అమ్మడు ఇచ్చిన వార్నింగ్ ఏమైనా పని చేస్తుందో లేదో !

Related News

విజయ్ పక్కన త్రిష.. విమర్శలకు సంజనా గల్రాని దిమ్మతిరిగే ఆన్సర్!

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

Big Stories

Advertisement
×