KL Rahul Century : లార్డ్స్ వేదిక గా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసింది. 387 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. టీమిండియా 254/5 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ కే.ఎల్. రాహుల్ అద్బుతమైన సెంచరీ చేశాడు. 176 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు ఉన్నాయి. అయితే లంచ్ సమయానికి ముందు రాహుల్ సెంచరీ చేసేందుకు అవకాశం ఇచ్చేందుకు రన్ కి ప్రయత్నించాడు. రిషబ్ పంత్ 74 పరుగులు చేసి అనవసర రన్ కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. కే.ఎల్. రాహుల్ సెంచరీ చేశాడనే సంతోషం కొద్ది సేపు కూడా నిలవలేకపోయింది. సెంచరీ చేసిన కొద్ది సేపటకే క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు రాహుల్. దీంతో రాహుల్ ఔట్ కాగానే నితీశ్ రెడ్డి క్రీజులోకి వచ్చేశాడు.
Also Read : IND vs ENG : లార్డ్స్ లో పెట్టే ఫుడ్ ఇదే.. ఇంగ్లాండ్ బిర్యాని పెట్టడం లేదని అలిగిన టీమిండియా ప్లేయర్లు ?
పంత్ రనౌట్..
వాస్తవానికి లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 65.3 ఓవర్లకు 4 వికెట్లు మాత్రమే నష్టపోయింది. లంచ్ కంటే ముందు బషీర్ బౌలింగ్ లో సింగిల్ కోసం ప్రయత్నించిన పంత్ ను బెన్ స్టోక్స్ రన్ ఔట్ చేశాడు. 248 పరుగుల వద్ద టీమిండియా 4వ వికెట్ ను కోల్పోయింది. అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించేశారు. కేఎల్ రాహుల్ 98 పరుగుల వద్ద పంత్ రనౌట్ కాగానే.. క్రీజులోకి జడేజా వచ్చాడు. ఆ తరువాత సెంచరీ చేసిన రాహుల్ కొద్ది సేపటికీ క్యాచ్ ఔట్ అయ్యాడు. రాహుల్ కోసం పంత్ రన్ ఔట్ కావడం.. ఇక రాహుల్ కూడా ఔట్ కావడంతో టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆల్ రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఇద్దరూ ఆల్ రౌండర్లు నెమ్మదిగా ఆడుకుంటున్నారు. ఒకవేళ వికెట్ కోల్పోతే.. టీమిండియా కష్టాల్లో పడుతుందని మెల్లగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు.
లంచ్ కి ముందు.. లంచ్ తరువాత
వాస్తవానికి మంచి ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరూ లంచ్ కి ముందు ఒకరు ఔట్ అయితే.. లంచ్ తరువాత ఒకరు పెవిలీయన్ కి చేరడం విశేషం. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒక్కడే సెంచరీ చేశాడు. అతనికి తోడు రిషబ్ పంత్ 4 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 1, కరుణ్ నాయర్ 40, గిల్ 16 పరుగులు మాత్రమే చేశారు. ప్రస్తుతం జడేజా, నితీశ్ పరుగులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిస్ వోక్స్, ఆర్చర్, బెన్ స్టోక్స్, బషీర్ తలో వికెట్ తీశారు.