DON 3:ఈ మధ్యకాలంలో సౌత్ హీరోలు బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోగా కాకుండా విలన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) ‘వార్ 2’ చిత్రంతో బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan)హీరోగా.. ఎన్టీఆర్ విలన్ రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బాటలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. అందులోనూ విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ ను ఫాలో అవుతున్న విజయ్ దేవరకొండ..
ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డాన్ -3’ సినిమాలో రణ్ వీర్ సింగ్(Ranvir Singh)హీరోగా.. కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) స్థానంలో ఇప్పుడు రణ్ వీర్ ఎంట్రీ ఇవ్వడంతో చర్చలు మొదలవుతున్న నేపథ్యంలో మరొకవైపు విలన్ పాత్ర కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింద. ఇప్పటికే ఆయనకు కథ వినిపించగా ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.. దీనికి తోడు ఈ పాత్ర హీరోకి ధీటుగా ఉండేటట్టు డిజైన్ చేశారని ఒక వార్త బయటకు రావడంతో ఎన్టీఆర్ ని విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్నాడని అందరూ అనుకున్నారు.
డాన్ 3లో విలన్ గా రౌడీ హీరో.. క్లారిటీ ఇదే..
అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విలన్ గా నటించడం లేదని సమాచారం. డాన్ 3 చిత్ర బృందం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారట. అయితే విజయ్ మాత్రం ఆ పాత్రను తిరస్కరించినట్లు సమాచారం. మొత్తానికైతే అందులో విలన్ గా నటించడం ఇష్టం లేకే ఈ పాత్రను వదులుకున్నారు అని క్లారిటీ వచ్చేసింది. ఇక దీన్ని బట్టి చూస్తే విజయ్ ను ఎవరు తప్పించలేదని, ఆయనే సినిమా నుండి తప్పుకున్నారని క్లారిటీ వచ్చేసింది. రౌడీ హీరో విలన్ గా బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు అనే వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు.
రౌడీ హీరో సినిమాలు..
విజయ్ దేవరకొండ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే సినిమా చేస్తున్నారు .ఇందులో ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri borse) విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. భారీ అంచనాల మధ్య జూలై 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే సరైన సక్సెస్ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఎలాగైనా సరే ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి తీరాల్సిందే అని పట్టు పట్టారు. మరి ఈ సినిమా ఆయన కెరియర్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.