Trolls on Kingdom Collections: విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కలెక్షన్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ ఈ కలెక్షన్స్ నిజమేనా సార్? సెటైర్లు విసురుతున్నారు యాంటి ఫ్యాన్స్. దీనికి కారణం నాగవంశీ కామెంట్స్. ఇటీవల ఈవెంట్లో కలెక్షన్లపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కింగ్డమ్ వసూళ్లపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకి అసలు సంగతేంటనేది ఇక్కడ ఆర్టికల్లో చూద్దాం.
కింగ్ డమ్ హిట్టా?
విజయ్ దేవరకొండ, భార్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం (జూలై 31) వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కింగ్డమ్లో విజయ్ యాక్టింగ్, లుక్కి సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ఫస్టాఫ్ కూడా ప్రతి ఆడియన్ని ఆకట్టుకునేలా సాగింది. అయితే సెకండాఫ్లో ఉన్న ల్యాగ్, ఆకట్టుకోలేని కథనంతో మూవీ ప్రేక్షకుడిని నిరాశ పరిచింది. ఫలితం ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచుకుంది. కొన్ని చోట్ల అయితే సినిమాలో అసలు లాజిక్ లేదని, ఏం సినిమా రాబూ అంటున్నారు ఆడియన్స్.
కానీ,ఫ్యాన్స్ మాత్రం ఫైనల్గా మా హీరో హిట్ కొట్టేశాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మూవీ టీం కూడా సాయంత్రం సక్సెస్ మీట్ పెట్టి కింగ్డమ్ విజయం సాధించిందని ప్రకటించుకుంది. ఇక లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రమిది. లైగర్ భారీ డిజాస్టర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ యావరేజ్‌గా నిలిచాయి. అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తున్న విజయ్ కింగ్డమ్పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా విజయ్ నుంచి ఓ భారీ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. అది కింగ్డమ్ ఇస్తుందని ఆశపడ్డారు.
కలెక్షన్స్ నిజమేనా?
కానీ, చూస్తుంటే ఈ సారి కూడా విజయ్కి ఆశించిన విజయ్ దక్కేలా కనిపించడం లేదు. ఫస్ట్ డే ఈ సినిమా వసూళ్లు రూ. 39 కోట్ల గ్రాస్ సాధించిందని మూవీ టీం ప్రకటించింది. కానీ, ఇవి నిజమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల మూవీ ఈవెంట్లో కలెక్షన్లపై ప్రశ్నంచగా.. దానిదేముంది మీకు ఎంతకావాలంటే అంత వేస్తామంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్.. కింగ్డమ్ కలెక్షన్స్ ఎన్నో సందేహాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ ఈ కలెక్షన్స్ మీ కోసమా? మా కోసమా? వంశీ సర్ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకి ఇవి నిజమైన కలెక్షన్లేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఇవి ఎవరి కలెక్షన్స్ అనేవి నాగవంశీకే తెలియాలి. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల పైగా నెట్ సాధించగా.. రూ. 26 కోట్లపైగా గ్రాస్ కలెక్షన్స్ చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.
Also Read: Kingdom Hridayam Song: లక్షలు పోసి పాట తీశారు.. ఇప్పుడు భలే కవర్ చేస్తున్నారే.. నాగవంశీపై ట్రోల్స్