India’s Longest Railway Tunnel: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. అత్యాధునిక సాకేంతికతను ఉపయోగించుకుని రైల్వేను మరింత ముందుకు తీసుకెళ్తోంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జి, అంజిఖ్వాడ్ రైల్వే బ్రిడ్జి, పంబన్ రైల్వే బ్రిడ్జిలాంటి ఇంజినీరింగ్ అద్భుతాలను సృష్టిస్తోంది. కొండలను పిండి చేస్తూ కిలో మీటర్ల కొద్ది రైల్వే టన్నెల్స్ ను నిర్మిస్తోంది. దేశ ప్రజలకు రైల్వే ప్రయాణాన్ని మరింత చేరువ చేస్తోంది. అందులో భాగంగానే దేశంలో పలు రైల్వే టన్నెల్స్ ను నిర్మించింది భారతీయ రైల్వే సంస్థ. వీటిలో అతిపెద్ద రైల్వే టన్నెల్ ఏది? ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలోనే అతిపెద్ద రైల్వే టన్నెల్ ఇదే!
దేశంలోని అతిపెద్ద రైల్వే టన్నెల్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది. దాని పేరే పీర్ పంజల్ రైల్వే టన్నెల్. ఇది ఏకంగా 11.21 కిలో మీటర్లు ఉంటుంది. భారత్ లో అతి పొడవైన రైల్వే సొరంగంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే మార్గంలో భాగంగా హిమాలయాలలో నిర్మించబడింది. జమ్మూ- కాశ్మీర్ లోని పీర్ పంజల్ పర్వత శ్రేణిలో బనిహాల్- కాజీగుండ్ మధ్యలో విస్తరించి ఉంటుంది. ఇది కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది.
పీర్ పంజల్ రైల్వే టన్నెల్ ప్రత్యేకతలు
ఈ రైల్వే టన్నెల్ హిమాలయ పర్వతాలలో సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితులలో నిర్మించబడింది. ఇది అత్యాధునిక భద్రతా వ్యవస్థలను కలిగి ఉంది. ఇందులో ఫైర్ రిసిస్టెన్స్, ఎమర్జెన్సీ వెంటిలేషన్ సహా అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ సొరంగంలో 3 మీటర్ల వెడల్పు ఉన్న సర్వీస్ రోడ్ కూడా ఉంది. ఇది అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. రైల్వే ట్రాక్ పక్కన ఈ రోడ్డును నిర్మించారు. ఈ సొరంగాన్ని 2013లో రైలు రాకపోకల కోసం ప్రారంభించబడింది. పీర్ పంజల్ సొరంగం కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో సంధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, ముఖ్యంగా కఠినమైన వాతావరణ పరిస్థితులలో రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Read Also: వందే భారత్ స్లీపర్‌పై రైల్వే మంత్రి కీలక ప్రకటన.. వచ్చేది అప్పుడేనట!
మంచు కురిసినా సజావుగా రైలు ప్రయాణం
ఈ రైల్వే టన్నెల్ అందుబాటులోకి రాకముందు, ప్రతి ఏటా శీతాకాలంలో ఈ మార్గంలో విపరీతమైన మంచు కురిసేది. ఆ సమయంలో రైల్వే ట్రాక్ ల మీద విపరీమైన ముంచు కురిసి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలిగేవి. నెలల తరబడి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించిన భారీ హిమపాత సవాళ్లను అధిగమించి, ఏడాది పొడవునా రైలు సేవలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేలా ఈ టన్నెల్ ను నిర్మించారు. ఈ రైల్వే సొరంగ మార్గం భారతీయ రైల్వే ఇంజనీరింగ్ శక్తికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.
Read Also: మెట్రోలోకి డ్రైవర్ లెస్ ట్రైన్స్ వచ్చేశాయ్, చూడ్డానికి భలే ఉన్నాయే!