BigTV English

Trolls on Mahesh Babu : ఆడవారిని బూతులు తిడితే కనీసం పట్టించుకోవా ? మహేష్ బాబు ధర్మం పాటించలేదు అంటూ ట్రోల్స్

Trolls on Mahesh Babu : ఆడవారిని బూతులు తిడితే కనీసం పట్టించుకోవా ? మహేష్ బాబు ధర్మం పాటించలేదు అంటూ ట్రోల్స్

Trolls on Mahesh Babu :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు మహేష్ బాబు (Maheshbabu). యుక్త వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత తన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు అంతర్జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్నారు. తాజాగా రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో ‘ఎస్ ఎస్ ఎం బి 29’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్లో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు పలువురు సినీ సెలబ్రిటీల వ్యక్తిగత ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతున్నారు.


లుక్ తో సరిపెట్టుకుంటున్న ఫ్యాన్స్..

అలా దర్శనమిస్తున్న లుక్కుతోనే అభిమానులు సరిపెట్టుకుంటున్నారు. అయితే మహేష్ బాబును తెరపై చూడడానికి ఇంకా సమయం పడుతుంది.. కాబట్టి.. ఆయన కెరియర్ లో సక్సెస్ అయిన సినిమాలను థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. రీ రిలీజ్ లో కూడా ఈ సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి.


మహేష్ బాబు పై భారీ ట్రోల్స్..

ఇదిలా ఉండగా ఎప్పుడూ సినిమాలపైనే ఫోకస్ చేస్తూ.. అటు ఫ్యామిలీ కోసం మాత్రమే సమయాన్ని కేటాయించే మహేష్ బాబు ఎప్పుడూ కూడా వివాదాలకు వెళ్లడు. అసలు సినీ ఇండస్ట్రీలో ఏదైనా అంశం జరిగితే దానిపై స్పందించడానికి కూడా ఆయన ముందు ఉండడు. ఇక అమ్మాయిల విషయంలో అయితే అసలే జోక్యం చేసుకోరు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు పై భారీ ట్రోల్స్ వస్తున్నాయి. అందులోను అమ్మాయి విషయంలో కావడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు.. మహేష్ బాబు ‘అతిథి’ సినిమా సమయంలో జరిగిన ఘటన.. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవ్వడంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మహేష్ బాబు పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మొదటి సినిమా షూటింగ్ సెట్లోనే అవమానం..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తున్న మాధవి లత (Madhavi Latha) హీరోయిన్ గా మారకముందు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసింది. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చేసిన మొదటి సినిమా అతిథి. తెలుగులో మహేష్ బాబు హీరోగా విడుదలైన ఈ అతిథి లో హీరోయిన్ త్రిష (Trisha) స్నేహితురాలిగా మొట్టమొదటిసారి నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఒక ఘటనను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.

హీరోయిన్ పై నోరు జారిన అసిస్టెంట్ డైరెక్టర్..

ఆ ఇంటర్వ్యూలో మాధవి లత మాట్లాడుతూ.. ఎదుటివారు మంచిగా మాట్లాడితే మనం కూడా మంచిగా మాట్లాడతాము. ఎవరైనా కాస్త వ్యతిరేకంగా మాట్లాడితే అసలు నేను లెక్క చేయను. అయితే నా మొదటి సినిమా మహేష్ బాబు అతిథి.ఈ సినిమా షూటింగ్ సమయంలో షాట్ లో అందంగా కనిపించడానికి నేను చాలా బాగా రెడీ అయ్యాను. అందతలోనే ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అప్పుడే మేకప్ ఎవరు చేసుకోమన్నారు? అని అనగానే.. అదేంటండి.. షాట్ లో బాగా కనిపించాలి అంటే అందంగా రెడీ అవ్వాలి కదా అన్నాను. వెంటనే అతడు.. ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూనే వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించాడు.

అంత మాటన్నా మహేష్ బాబు నోరు మెదపలేదు – మాధవి లత

నాకు బూతులు మాట్లాడితే అస్సలు నచ్చదు. అంత పెద్ద బూతు మాట్లాడితే మహేష్ బాబు నాకు ఎదురుగానే నిలబడ్డారు. కెమెరా పొజిషన్ నా మీదే ఉంది. మహేష్ బాబు ఒక్క మాట మాట్లాడలేదు. ఏంటా మాట ఆడపిల్లలను అలా అనొచ్చా.. ఎందుకు అలా అన్నారు అని ఏదైనా నోరెత్తి మాట్లాడొచ్చు కదా.. నాకు బాగా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది

మహేష్ బాబు ధర్మం మరిచారా?

ఎవరికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ తో పాటు ఎదుటివారిని.. ముఖ్యంగా అమ్మాయిలను ఎవరైనా అనవసరంగా మాట్లాడితే.. కనీసం బాధ్యతగా మనం మన ధర్మాన్ని పాటిస్తాం.. కానీ మహేష్ బాబు మాత్రం తన ఎదురుగా తనతో పని చేసే అమ్మాయిని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మాట్లాడుతుంటే నోరు మెదపకపోవడంతో మహేష్ బాబు పై ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి.. అక్కడే ఉన్నావు కదా అన్న.. నువ్వేం చేస్తున్నావ్..నీ ధర్మాన్ని నువ్వు మరిచావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఆమె ఆవేదనను మహేష్ బాబు అర్థం చేసుకుంటారా? ఆరోజు ఎందుకు మాట్లాడలేదు అనే విషయంపై క్లారిటీ ఇస్తారా? అని నెటిజెన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు.

Related News

Chiranjeevi : చిరు బర్త్‌డే ట్రీట్… యంగ్ డైరెక్టర్‌తో మరో సినిమా.. రేపే అనౌన్స్‌మెంట్

Akhanda 2 Postponed: ఆ రూమర్సే నిజమయ్యాయి… అఖండ 2 వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Disco Shanti: అయినవాళ్లే దూరం పెట్టారు.. ఆకలితో నరకం చూశాం – డిస్కో శాంతి

Kangana Ranaut: 40కి చేరువలో పెళ్లికి సిద్ధమవుతున్న కంగనా.. అదిరిపోయే రియాక్షన్!

Mirai Movie: భారీ ధరకు ‘మిరాయ్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. రిలీజ్ కు ముందే లాభాలు..

Udayabhanu: వారికి భయపడి పవన్ కళ్యాణ్ మూవీ మిస్ చేసుకున్నా – ఉదయభాను

Big Stories

×