OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్టే సరికొత్త స్టోరీలతో ముందుకు వస్తున్నారు మేకర్స్ . రీసెంట్ గా హారర్ జనర్ లో ఓటీటీలోకి వచ్చిన ఒక హాలీవుడ్ మూవీ బాగానే భయపెడుతోంది. ఇందులో ముసుగు ధరించిన మనుషులు, టీనేజర్లను ఒక్కొక్కరినీ దారుణంగా చంపుతుంటారు. ఈ సినిమా చివరి వరకూ ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ స్లాషర్ హారర్ మూవీ పేరు ‘Clown in a Cornfield’. 2025లో వచ్చిన ఈ సినిమాకు ఎలీ క్రెయిగ్ దర్శకత్వం వహించాడు. ఇది 2020లో ఆడమ్ సెసారే రాసిన ‘యంగ్ అడల్ట్’ నవల ఆధారంగా రూపొందింది. ఇందులో కేటీ డగ్లస్, ఆరోన్ అబ్రమ్స్, కార్సన్ మాక్‌కార్మాక్, విన్సెంట్ ముల్లర్, కెవిన్ డురాండ్, విల్ సాస్సో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా 2025 మే 9న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDB లో ఈ సినిమకి 5.7/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1991లో మిస్సౌరీలోని కెటిల్ స్ప్రింగ్స్ అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. అక్కడ బేపెన్ కార్న్ సిరప్ ఫ్యాక్టరీ సమీపంలో ఒక టీనేజ్ పార్టీ జరుగుతుంది. ఇద్దరు టీనేజర్లు ఆ పార్టీ నుండి దూరంగా కార్న్‌ఫీల్డ్‌లోకి వెళతారు. అక్కడ వాళ్ళు దారుణంగా హత్య చేయబడతారు. ఈ సంఘటన పట్టణంలో ఒక అంతుపట్టని రహస్యంగా మిగిలిపోతుంది. ఇప్పుడు స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. క్విన్ మేబ్రూక్ అనే టీనేజ్ అమ్మాయి తల్లి సమంతా చనిపోవడంతో, తన తండ్రి గ్లెన్ తో కలిసి ఫిలడెల్ఫియా నుండి కెటిల్ స్ప్రింగ్స్‌కు కొత్త జీవితం గడపడం కోసం వస్తుంది. గ్లెన్ పట్టణంలో కొత్త వైద్యుడిగా ఉద్యోగం చేస్తాడు. క్విన్ కోల్ జానెట్, మాట్, రోనీ, టక్కర్ అనే స్థానిక టీనేజర్లతో స్నేహం చేస్తుంది. అక్కడ బేపెన్ ఫ్యాక్టరీ కాలిపోవడం వల్ల పట్టణం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. దీనికి అక్కడ ఉన్న పెద్దవాళ్ళు టీనేజర్లను నిందిస్తారు.
ఆతరువాత క్విన్ ఫ్రెండ్స్ తీసుకున్న ఒక వీడియోలో, ముసుగు ధరించిన మరో వ్యక్తి ని గమనిస్తుంది. ఇంతలో, టక్కర్‌ను ఆ వ్యక్తి ఇంట్లో దాడి చేసి చంపేస్తాడు. ఆ తరువాత ఒక్కొక్కరూ ఆవ్యక్తి చేతిలో చనిపోతుంటారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతిలో క్విన్ కూడా తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోతుంది. ఆమె కళ్ళు తెరిచి చూసే సరికి, మరో ముగ్గురు ముసుగు వ్యక్తులు బంధించి ఉంటారు. ఆ తరువాత ఒక షాకింగ్ ట్విస్ట్ తో స్టోరీ ఓ కొలిక్కి వస్తుంది. చివరికి అక్కడ టీనేజర్లని ఎందుకు చంపుతున్నారు ? ఎవరు చంపుతున్నారు ? క్విన్ ను కూడా చంపేస్తారా ? అనే విషయాలను తెలుసుకోవానుకుంటే ? ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : లేడీ పోలీస్ నే పెళ్ళాడి చుక్కలు చూపించే సైకో… క్లైమాక్స్ ట్విస్ట్ కి మైండ్ బెండ్