OTT Movie : ఓటీటీలో ఒక హాలీవుడ్ మూవీ అదిరిపోయే స్టోరీతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో స్నేహితులను ఒక పార్టీకి ఆహ్వానించి, ఒక వ్యక్తి భయంకరమైన గేమ్ ఆడతాడు. ఈ గేమ్ లో నిజం చెప్పకపోతే ఒక్కొక్కరూ చనిపోతుంటారు. ఈ సినిమా సీను సీనుకూ గుండెల్లో దఢ పుట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ మూవీ పేరు ‘ట్రూత్ ఆర్ డై’ (Truth or Die). 2012లో వచ్చిన ఈ సినిమాకి రాబర్ట్ హీత్ దర్శకత్వం వహించారు. ఇందులో డేవిడ్ ఓక్స్, టామ్ కేన్, జెన్నీ జాక్వెస్, లియామ్ బాయిల్, జాక్ గోర్డన్, ఫ్లోరెన్స్ హాల్, అలెగ్జాండర్ వ్లాహోస్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ స్టోరీ ఒక రివెంజ్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఇందులో ట్రూత్ ఆర్ డై అనే ఆట ఒక భయాంకరనైన మలుపు తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది,
స్టోరీలోకి వెళితే
సినిమా ఒక హాలోవీన్ పార్టీతో మొదలవుతుంది. ఇక్కడికి ఫెలిక్స్ అనే యువకుడు ఒంటరిగా వస్తాడు. పార్టీలో చాలామంది స్నేహితులు ఉంటారు. అందులో ఫెలిక్స్ అనే అతను జెమ్మా అనే అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. లూక్ అనే వ్యక్తి అతన్ని ఆమెతో మాట్లాడమని, కొకైన్ ఇచ్చి ధైర్యం తెప్పిస్తాడు. ఈ క్రమంలో ఫెలిక్స్, జెమ్మాను డేట్‌కు రమ్మని అడుగుతాడు. ఆమె అందుకు మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తుంది.అదే సమయంలో, ఎలియనోర్, పాల్ ఒక గదిలో ఏకాంతంగా గడపడానికి ప్రయత్నిస్తారు. కానీ పాల్ మద్యం తాగి స్పృహ కోల్పోతాడు. నిరాశకు గురైన ఎలియనోర్, పార్టీలో ట్రూత్ ఆర్ డేర్ ఆటను ప్రారంభిస్తుంది. ఈ ఆటలో బాటిల్ ఫెలిక్స్ వైపు తిరిగినప్పుడు, అతను “ట్రూత్” ఎంచుకుంటాడు. ఎలియనోర్ అతన్ని తన ఫాంటసీతో ఎవరినైనా ఎంచుకోమని అడుగుతుంది. ఫెలిక్స్ జెమ్మాను ఎంచుకుంటాడు. దీనితో క్రిస్ ఈర్ష్యతో రగిలిపోతాడు. ఫెలిక్స్‌ను కొట్టి అవమానిస్తాడు. జెమ్మా క్రిస్‌ను విడిచిపెట్టి ఫెలిక్స్‌ను ఓదార్చడానికి వెళ్తుంది. కానీ ఫెలిక్స్ అవమానంతో పార్టీ నుండి వెళ్ళిపోతాడు.
కొన్ని నెలల తర్వాత, క్రిస్, జెమ్మా, పాల్, ఎలియనోర్, లూక్‌లకు ఫెలిక్స్ పుట్టినరోజు పార్టీకి ఆహ్వానం అందుతుంది. అది అతని కుటుంబానికి చెందిన ఒక గొప్ప మానర్‌లో జరుగుతుందని చెప్పబడుతుంది. అయితే వీళ్ళంతా అక్కడ చేరుకున్నప్పుడు, మానర్ ఖాళీగా ఉందని తెలుస్తుంది. అక్కడ ఫెలిక్స్ కి బదులు అతని సోదరుడు జస్టిన్, ఒక మాజీ సైనికుడుని కలుస్తారు. ఫెలిక్స్ వ్యాపార పర్యటనలో ఉన్నాడని, పార్టీని కొనసాగించమని చెబుతాడు. అక్కడ మద్యం పుష్కలంగా ఉంటుంది. జస్టిన్ మళ్లీ ట్రూత్ ఆర్ డేర్ ఆటను సూచిస్తాడు. ఆట మొదలైన తర్వాత, జస్టిన్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడిస్తాడు. ఫెలిక్స్ ఆ హాలోవీన్ పార్టీ తర్వాత క్యాబిన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని, అతని జేబులో “Truth or Dare, bitch!” అని రాసిన పోస్ట్‌కార్డ్ ఉందని చెబుతాడు.
జస్టిన్ ఈ పోస్ట్‌కార్డ్ వీరిలో ఒకరు పంపారని నమ్ముతాడు. అది ఫెలిక్స్ ఆత్మహత్యకు కారణమైందని ఆరోపిస్తాడు. అతను తన కుటుంబంకు జరిగిన అవమానాన్ని సరిదిద్దడానికి న్యాయం కోసం ఈ ఆటను ఉపయోగిస్తాడు. జస్టిన్ ఈ ఆటను ఒక భయంకరమైన స్థాయికి తీసుకెళ్తాడు. అతను అక్కడికి వచ్చిన వాళ్ళను బందీలను చేసి, ఫెలిక్స్ ఆత్మహత్య వెనుక నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ అతను ఆడే గేమ్ లో చనిపోతుంటారు. చివరికి ఎలియనోర్ నిజాన్ని బయటికి చెప్తుంది. హాలోవీన్ పార్టీలో, పాల్ మద్యం తాగి స్పృహ కోల్పోవడంతో ఆమె కోపంతో, ఫెలిక్స్‌తో మేకౌట్ చేసి, దానిని వీడియోలో రికార్డ్ చేస్తుంది. ఆమె ఈ వీడియోను ఉపయోగించి ఫెలిక్స్‌ను బ్లాక్‌మెయిల్ చేసింది. తన కుటుంబ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసింది. ఫెలిక్స్ ఈ అవమానం భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు.ఎందుకంటే అతని సోదరుడు జస్టిన్, ఒక హోమోఫోబ్. ఈ వీడియో గురించి తెలిస్తే అతన్ని హింసిస్తాడని భయపడి ఉంటాడు. చివరికి జస్టిన్ తన సోదరుడి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడా ? ఆ పార్టీ కి వచ్చిన అందర్నీ చంపుతాడా ? ఎవరైనా బతుకుతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మెంటల్ ఎబిలిటీ సరిగ్గా లేని పోలీస్… ఒక్కో కేసులో ఊహించని ట్విస్టులు… అదిరిపోయే సర్ప్రైజులు