Dancers association: గత కొంతకాలంగా టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ లో పెద్ద చర్చే నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న సుమలత (Sumalatha ) ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందనే నేపథ్యంలో.. ఏకంగా 10 మంది సభ్యులు రాజీనామా చేయడం.. ఇందులోకి ఫిలిం ఫెడరేషన్ జోక్యం చేసుకొని పదిమందిని కలుపుకొని వెళ్ళమని చెప్పినా..సుమలత వినకపోవడం, రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi ), బాలకృష్ణ (Balakrishna) లాంటి సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా సుమలత తన తీరును మార్చుకోకపోవడం, సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అటు సుమలత భర్త ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ నిర్మాతల మండల ని కలవడం, పెద్దల ముందు అంగీకరించి.. సమావేశం పూర్తయ్యాక మళ్లీ డాన్సర్స్ అసోసియేషన్లో ఉప ఎన్నికలు నిర్వహించడానికి తన వంతు సహాయం చేయడం అన్నీ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
అయితే సుమలత వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వగా.. ఇప్పుడు ఆమెను గద్దె దింపే ప్రయత్నం జరుగుతోందనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే కృష్ణానగర్లోని ఒక ప్రైవేటు హోటల్లో డ్యాన్సర్ అందరూ సమావేశమై, డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ ని ఎన్నుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మెజారిటీ యూనియన్ డ్యాన్సర్స్ తమ అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత కార్యవర్గాన్ని కాకుండా మెజారిటీ డ్యాన్సర్స్ రఘు మాస్టర్ని ఎన్నుకొని ప్రెసిడెంట్ గా గుర్తించాలని ఫిలిం ఫెడరేషన్ ను కోరడానికి చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది.
also read:మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!
అటు సుమలత కార్యవర్గానికి ఫిలిం ఫెడరేషన్ కూడా సహాయం అందించడానికి వెనకడుగు వేస్తోంది. అందుకే సుమలత కార్యవర్గం బదులుగా రఘు మాస్టర్ కార్యవర్గానికి మద్దతు ఇవ్వాలని మెజారిటీ డ్యాన్సర్స్ కోరనున్నారు. సుమలత ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణితో అసోసియేషన్ ను పాడు చేశారని, చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్దలు, ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఫెడరేషన్ పెద్దలు చెప్పినా వినకుండా ఉప ఎన్నికల నిర్వహించడం పై మెజారిటీ డ్యాన్సర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 600 మంది డ్యాన్సర్స్ ఉన్న ఈ అసోసియేషన్ లో సుమలత నిర్వహించిన ఉప ఎన్నికల్లో కేవలం 116 మంది మాత్రమే పాల్గొన్నారు. మెజారిటీ డ్యాన్సర్స్ ఈ ఉప ఎన్నికల్లో పాల్గొనలేదు. సుమారుగా 350 మంది డ్యాన్సర్స్ రఘు మాస్టర్ తోనే ఉన్నారని యూనియన్ డ్యాన్సర్లు కూడా చెబుతున్నారు.
అందుకే రఘు మాస్టర్ కి సపోర్టుగా గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, ప్రకాష్ మాస్టర్, భాను మాస్టర్ , విజయ్ పోలాకి మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్ , శ్రష్టి మాస్టర్ తదితరులు సపోర్ట్ గా ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే పెద్దలతో మాట్లాడి ప్రెసిడెంట్ గా ఉన్న సుమలతను గద్దె దింపాలని చర్చలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. మరి ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.