Anasuya Bharadwaj: సైబర్ నేరగాళ్ల మోసాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త మోసం బయటపడుతూ వస్తుంది. ప్రతిరోజు వార్తల్లో సైబర్ నేరగాళ్లు వల్ల మోసపోయిన బాధితులను చూస్తూ ఉంటాం. చాలామంది సెలబ్రిటీలు జాగ్రత్త వహించాలి అంటూ చెబుతూ ఉంటారు. కానీ సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు సైబర్ నేరగాళ్ల మోసాలకు బలైపోతున్నారు.
ఇక రీసెంట్ గా అనసూయ కూడా సైబర్ నేరగాళ్ల వలన మోసపోయింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ స్టోరీ రూపంలో బయటపెట్టింది అనసూయ.
మోసపోయిన అనసూయ
అనసూయ ఆన్లైన్లో కొన్ని బట్టలు ఆర్డర్ చేసింది. అయితే దానికి సంబంధించి ఆర్డర్ రిసీవ్ చేసుకోలేదు. దాదాపు నెలరోజులు అయిపోయినా కూడా ఆ ఆర్డర్ రాకపోవడం పక్కనపెడితే. ఆ డబ్బులు కూడా రిఫండ్ కాలేదు. దీనివలన ఎదురుచూసి, సహనం నశించి మోసపోయినట్లు తెలిపింది. ఇంస్టాగ్రామ్ వేదికగా స్టోరీ పెట్టింది. ఈ స్టోరీ చేసిన చాలామంది ప్రస్తుతం ఆ బ్రాండ్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు.
అనసూయ పోస్ట్ లో ఏముంది.?
ప్రియమైన @truffle_india! మీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న తర్వాత.. ఒక నెలకు పైగా మీ నుండి కొనుగోలు చేసిన వస్తువులను డెలివరీ చేయకుండా మీరు నా డబ్బును దోచుకున్నారని నేను చెప్పాలి.. ఎటువంటి వాపసు లేదా అవసరమైన వాటిని నిజంగా చేయడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు.. వ్యక్తిగత వ్యాపార సంస్థల పేరుతో మిమ్మల్ని దోచుకోవడానికి అవకాశాల కోసం చూసే ఈ వృత్తిపరమైన బాధ్యతారహిత స్టోర్ హ్యాండిల్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను ఇందుమూలంగా తెలియజేస్తున్నాను.
Also Read: Mayasabha Trailer : వెన్నుపోటు వెనక రాజశేఖర్ రెడ్డి, రాజకీయాల్లో సరికొత్త దృక్కోణం