IND vs ENG: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England ) మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో… అదిరిపోయే సీన్స్ జరుగుతున్నాయి. విరాట్ కోహ్లీ లేకున్నా… అతని పాత్రను టీమ్ ఇండియా కెప్టెన్ గిల్.. భర్తీ చేస్తున్నాడు. గొడవ పెట్టుకునే సమయంలో కోహ్లీ కంటే ఎక్కువగానే రెచ్చిపోతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ ప్లేయర్లు చేసిన చెత్త పనికి… గ్రౌండ్ లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ గిల్. మూడవరోజు ఆట ముగిసే సమయానికి… క్రాలే… మ్యాచ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసే పని చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన గిల్…. గ్రౌండ్ లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
టైం వేస్ట్ చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్లు
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs England ) మధ్య జరుగుతున్న లార్డ్స్ టెస్టులో.. తొలి ఇన్నింగ్స్ సమం అయింది. రెండు జట్లు కూడా 387 పరుగులు చేయడంతో… ఎవరికి కూడా ఆదిక్యం రాలేదు. నిన్న టీమిండియా ఆల్ అవుట్ కాగానే.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు వచ్చింది. బౌలర్లకు అద్భుతంగా పిచ్ అనుకూలిస్తోంది. దీంతో టీమిండియా కనీసం 5 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది. కానీ ఒకే ఒక్క ఓవర్ మాత్రమే పడింది.
అంతలోనే మూడవ రోజు ఫినిష్ అయిందని అంపైర్లు ప్రకటించారు. దీనికి కారణం లేకపోలేదు. మొదటి ఓవర్… బుమ్రా వేశాడు. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలే.. కాస్త ఓవర్ యాక్టింగ్ చేశాడు. బుమ్రా బౌలింగ్ వేస్తున్నప్పుడు… ఏదో గాయమైనట్లు వికెట్లను వదిలేశాడు. దాంతో… బంతి వేయకుండానే వెన్నుతిరిగాడు బుమ్రా. ఈ నేపథ్యంలో గిల్ చాలా సీరియస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత… ఐదవ బంతి పడగానే చేతికి గాయమైనట్లు క్రాలే… ఫిజియోథెరపిస్టును పిలిపించుకున్నాడు. ఇక అక్కడే గిల్ కు మండిపోయింది.
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన గిల్
ఒక్క ఓవర్కే మీరు ఓవర్ చేస్తున్నారు… ఇవాళ కనీసం ఐదు ఓవర్లు పడేవి అంటూ క్రాలేకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గిల్ (Shubhman gill). అంతేకాదు.. తన చూపుడు వేలుతో.. బండ బూతులు తిడుతూ హెచ్చరించాడు. ఆ తర్వాత రెండు చేతులు చూపిస్తూ చాలా వ్యంగంగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ర్యాగింగ్ చేశాడు. ఇక పీసుక్కోండి అంటూ… అసభ్యకరంగా చేతులను చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన టీమ్ ఇండియా అభిమానులు..గిల్ ను మెచ్చుకుంటున్నారు. ఇంగ్లాండ్ ఎదవలకు సరిగ్గా సమాధానం చెప్పాడని అంటున్నారు. విరాట్ కోహ్లీ లాగానే రియాక్ట్ అయి… మంచి పని చేశాడని చెబుతున్నారు.
FULL HIGHLIGHTS OF THE DRAMATIC END FOR DAY 3 😂🔥 pic.twitter.com/ICLqAsgEEL
— Johns. (@CricCrazyJohns) July 12, 2025