Gundeninda Gudigantalu Balu : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో హీరోలుగా హీరోయిన్లుగా నటించిన వాళ్లందరూ ఒకప్పుడు ఏదో ఒక పని చేస్తుండేవారు. సీరియల్స్ లోకి రాకముందు వ్యాపారాలు, అటు జాబులలో బిజీగా గడిపేవారు. అయితే నటనపై ఆసక్తి ఉండడంతో ఇటుగా అడుగులు వేసి ఇవే తన తమ కెరీర్ గా భావించి సీరియల్స్లలో బిజీగా ఉంటున్నారు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలు ఒకటి. ఈ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విష్ణు కాంత్. ఇందులో బాలు పాత్రలో కనిపించిన విష్ణు కాంత్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..
విష్ణు కాంత్ ఫ్యామిలీ విషయానికొస్తే..
విష్ణు కాంత్ ఒక తమిళ నటుడు.. మొదట తమిళ సీరియల్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. 2008 నుంచి టెలివిజన్ రంగంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెండితెరపైనా కూడా పలు చిత్రాల్లో మెరిశారు. ఇక ఈయన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కూడా కొద్ది కాలం పనిచేసినట్టు తెలుస్తోంది.. అయితే మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారంట. దీంతో తమ వృత్తి మగ్గం వర్క్ చేసేవాడంట. అందుకు సంబంధించిన వీడియోను కూడా విష్ణుకాంతే ఓ సందర్భంలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఆయన ఇలాంటి పనిచేశాడా? అంటూ అభిమానులు రిప్లై ఇస్తున్నారు.
భార్యతో విడాకులు..
39 ఏళ్ల విష్ణు కాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా నటి. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో ఒంటరిగా ఉంటున్నాడు. తమిళ సీరియల్స్ చేస్తూ సంయుక్త బిజీగా ఉంది. విష్ణు కాంత్ కూడా సీరియల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ హీరో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటాడు. లగ్జరీ కార్ దగ్గర కోర్టులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి..
సీరియల్స్ విషయానికొస్తే..
‘ఓరు ఊర్ల ఓరు రాజకుమారి’, ఎండ్రెండ్రుమ్ పున్నగై, సిప్పికుల్ ముత్తు, రజిని, గోకులమితిల్ సీత వంటి సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు మంచి ఆదరణ దక్కుతుండటంతో ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.. బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు స్పెషల్ ఈవెంట్స్ లలో సందడి చేస్తుంటాడు.. విష్ణుకాంత్ ఈమధ్య ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఎంటర్టైన్ మెంట్ షోలలో సందడి చేస్తున్నాడు.. ముఖ్యంగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొంటున్నాడు. ఈ షోలో వివిధ రకాల వంటలతో ఆకట్టుకుంటున్నాడు.. అంతేకాదు ఈ నటుడు సీరియల్స్ తో పాటుగా సినిమాలు చేస్తున్నాడు.