GHMC News: గ్రేటర్ హైదరాబాద్‌లో జనన-మరణ ధృవీకరణ పత్రాల జారీలో అవకతవకలను అడ్డుకట్టే వేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి తెరవెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-సీఆర్‌ఎస్‌ను తీసుకొచ్చింది.
జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో అవకతవకలను అరికట్టనుంది జీహెచ్ఎంసీ. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ను తీసుకోనుంది. ఈ వ్యవస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఉంటుంది.
ఇప్పటికే ఏపీ, అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు వాటిని ఉపయోగించుకుంటున్నాయి. జనన- మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి కేంద్రం సాప్ట్‌వేర్‌ని ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తోంది జీహెచ్ఎంసీ.
ఓఆర్‌జీఐ వెబ్ పోర్టల్‌ను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది జీహెచ్ఎంసీ. త్వరలో కొత్త విధానం అమల్లోకి వస్తుంది. జనన ధృవీకరణ పత్రాలను జారీకి తల్లిదండ్రుల తమ ఆధార్ వివరాలు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ ఇప్పటివరకు పట్టు బట్టలేదు. సీఆర్ఎస్ కింద భారతీయ పౌరులకు ఆధార్ తప్పనిసరి కానుంది.
ALSO READ: నగరంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య.. బైకులు నడుపుతున్న పిల్లలు
శరణార్థులకు జనన, మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ నెంబర్ తప్పనిసరి కానుంది. ప్రక్రియ పాత పద్దతుల మాదిరిగా ఉంటుందని, మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆమోదం పొందిన తర్వాత కేంద్రం నుండి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
సీఆర్ఎస్ కింద మీ-సేవా ద్వారా సేకరించి జీహెచ్‌ఎంసీకి పంపుతుంది. తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పోర్టల్‌కు వెళ్తుంది. జీహెచ్ఎంసీ ఆయా దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కి పంపుతుంది. సీఆర్ఎస్ కింద దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది.
ఈ వ్యవస్థ ద్వారా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఇచ్చినా అధికారులు, వివరాలు ఇచ్చే వైద్యులపై కఠినచర్యలు ఉండనున్నాయి. ఈ లెక్కన ప్రతీ దరఖాస్తును అధికారులు పరిశీలించాలించాలి. కొత్త వ్యవస్థతో తప్పుడు సర్టిఫికెట్లకు చెక్ పడనుంది