Niharika NM: గ్లోబల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నిహారిక ఎన్ ఎమ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ ప్రముఖులతో పాటు స్పోర్ట్స్ ప్రముఖుల వరకు ఎంతో మందితో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఈమె.. వారితో పలు ఇంటర్వ్యూలు చేస్తూ ఎన్నో విషయాలను రాబడుతూ అభిమానులకు మరింత చేరువయ్యింది. ముఖ్యంగా సినిమాలలో కూడా కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. తాజాగా నాని ది ప్యారడైజ్ మూవీ విలన్ తో ప్రేమలో పడినట్లు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా ఈ పోస్ట్ ను నిహారిక తో పాటు సదరు వ్యక్తి కూడా షేర్ చేయడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
యాక్షన్ ఎంటర్టైనర్ ‘కిల్’ చిత్రంలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్(Raghav Juyal).. ప్రస్తుతం నాని ‘ప్యారడైజ్’ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ రొమాంటిక్ గా దిగిన ఫోటోలను ఇటు నిహారిక అటు రాఘవ్ తమ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. రెడ్ హార్ట్ ఎమోజీని పంచుకున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోలలో ఒకరికొకరు హగ్ చేసుకుని చాలా క్లోజ్ గా, రొమాంటిక్ గా ఫోటోలు దిగారు. పైగా రెడ్ హార్ట్ తో పాటు ఈవిల్ ఐ, స్టార్ ఎమోజీలను క్యాప్షన్ గా జోడించి మరీ పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని, అందుకే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు అంటూ అటు నెటిజన్స్ ఇటు సెలబ్రిటీలు కూడా కంగ్రాట్స్ చెప్పుకొస్తున్నారు.
also read:జాన్వీ కపూర్ దక్షిణాదిలోనే స్థిరపడనుందా.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!
ఇకపోతే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని.. ఇది కేవలం ప్రమోషన్స్ మాత్రమే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే వీరిద్దరూ ప్రస్తుతం లండన్ నేపథ్యంలో వివేక్ బి అగర్వాల్ దర్శకత్వంలో రూపొందుతున్న భాయ్ తేరా స్టార్ హై అనే హిందీ కామెడీ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఇక దాని ప్రమోషన్స్ లో భాగంగానే ఈ జంట ఇలా కనిపించి.. రూమర్స్ క్రియేట్ అయ్యేలా చేసి.. తమ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. ఇది ప్రమోషన్స్ కోసమా లేక నిజంగానే ఈ జంట ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారా అన్నది తెలియాలి అంటే ఈ జంట నుంచి మరోసారి అధికారిక ప్రకటన వస్తే తప్ప తెలియని పరిస్థితి. ఏది ఏమైనా ఈ క్రేజీ జోడి షేర్ చేసిన ఈ రొమాంటిక్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తున్నాయి. అటు అభిమానులు, నెటిజన్లు వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందని మెచ్చుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇకపోతే నిహారిక సినిమాల విషయానికొస్తే.. మిత్రమండలి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. ఈ సినిమా సక్సెస్ అందుకోకపోయినా ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే తమిళ్లో పెరుసు అనే సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది నిహారిక.