Nikhil Siddarth: హ్యాపీ డేస్(Happy Days) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు నిఖిల్ సిద్ధార్థ్(Nikhik Siddarth). ఈ సినిమాలో నిఖిల్ పాత్రలో ఎంతో అద్భుతమైన నటనను కనబరిచి మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన తదుపరి వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. స్వామి రారా, కార్తికేయ, కార్తికేయ 2 వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిఖిల్ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సినిమా టికెట్ల రేట్లు…
ఇటీవల కాలంలో సినిమా టికెట్ల రేట్లు(Ticket Price) గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయ. సినిమా టికెట్ల రేట్లు అధికంగా పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోల్పోతున్నారంటూ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే సినిమా టికెట్ల రేట్ల కంటే కూడా మల్టీప్లెక్స్ థియేటర్లలో దొరికే స్నాక్స్ కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆ ధరలు చూసి ఎంతోమంది సినిమాలు చూడటానికి థియేటర్లకు రాకుండా ఉన్నారని కూడా పలువురు నిర్మాతలు సినీ సెలబ్రిటీలు ఈ విషయం గురించి మాట్లాడారు.
థియేటర్లో దొరికే స్నాక్స్ ధరలు ఎక్కువ…
తాజాగా నిఖిల్ సైతం ఇదే విషయం గురించి మాట్లాడుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. సినిమా టికెట్ రేట్లకు కూడా కాస్త లిమిట్ పెట్టాలని చెప్పిన ఈయన సినిమా టికెట్ల రేట్ల కంటే కూడా థియేటర్లలో మరొక పెద్ద సమస్య ఉందని అదే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ధరలని తెలిపారు. వీటిపై అధిక ధరలు పెంచేస్తూ ఆ భారం మొత్తం ప్రేక్షకుల మీదకు వేస్తున్నారని నిఖిల్ మండిపడ్డారు. ఇటీవల తాను కూడా ఓ థియేటర్లో చూసాను సినిమా టికెట్ల రేట్ల కంటే కూడా స్నాక్స్ కోసమే ఎక్కువ ఖర్చు అయిందని తెలిపారు. వెండితెరపై సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ఈ విధమైనటువంటి సమస్యలను పరిష్కరించాలి అంటూ ఈయన పంపినదారులను రిక్వెస్ట్ చేశారు.
At least allow us to take our Water bottles into the Theatres .
— Nikhil Siddhartha (@actor_Nikhil) July 19, 2025
ఇకపోతే థియేటర్ల లోపలికి కనీసం మా వాటర్ బాటిల్స్ (Water Bottle)అయినా తీసుకువెళ్లడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఈయన కోరారు. ఇలా సినిమా టికెట్ల రేట్ల గురించి థియేటర్లలో దొరికే స్నాక్స్ ధరల గురించి నిఖిల్ స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈయన చేసిన పోస్ట్ పట్ల ఎంతోమంది మద్దతు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ఈయన స్వయంభు (Swayambhu) అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాతో పాటు ది ఇండియా హౌస్ అనే మరో పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Anushka Shetty: అనుష్క ఎక్కడికి వెళ్లినా వెంట అది ఉండాల్సిందేనా.. అంత భయమా?