E-Paper
Advertisement

Marriage Independence : ప్రతి విషయంలో భర్త పర్మిషన్ అడుగుతున్నారా..?

Marriage Independence : ప్రతి విషయంలో భర్త పర్మిషన్ అడుగుతున్నారా..?
Advertisement

Marriage Independence :సాధారణంగా భార్యలు ఏపని చేయాలన్నా భర్త పర్మిషన్ తీసుకుంటుంటారు. పర్మిషన్ తీసుకోవడం మంచిదే కాని ప్రతీ విషయంపై ఆధారపడటమే అసలు సమస్యలకి కారణం.ఒక రకంగా వారు ఎంతగా ఆధారపడ్డారో కూడా అర్థం చేసుకోలేకపోతారంటే ఆ డిపెండెన్సీ ఎంతలా ఉండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి భార్య భర్తల మధ్య బాండింగ్ సరిగ్గా ఉండాలంటే
ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు.ఒకరి అభిప్రాయాలకి మరొకరు విలువ ఇవ్వడం , ఒకరికిని మరొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం.అయితే దీన్ని కొంతమంది భార్యలు సరిగ్గా అర్థం చేసుకోకుండా భర్తకి నచ్చడం అంటే తమ ఇష్టా ఇష్టాలని వదిలేసుకోవడమనుకుంటారు.ఏ పని చేయాలన్నా భర్తని అడగడమే పనిగా పెట్టుకుంటారు.
అయితే ఇలా ప్రతీసారి ప్రతీ పనికి భార్య భర్తపై ఆధారపడటం మంచిదేనా ..ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో చూద్దాం.

also read :Smartphone comparison: Oppo A6s 5G vs iQOO Z11x vs Lava Blaze Duo 3: బడ్జెట్ 5G రేసులో ఏది బెస్ట్?

Advertisement

ఇంపార్టెంట్ విషయాలకి అయితే ఒకే కాని ప్రతీ పనికి భర్త పర్మిషన్ తీసుకోవడం అంటే అది భార్యా భర్తల మధ్య బాండింగ్ ని వీక్ చేస్తుందని తేల్చేస్తున్నారు. అన్నింటికీ మించి భార్యల థాట్ ప్రాసెస్ కి అది పెద్ద అడ్డంకిగా మారుతుందని , ముఖ్యమైన, అవసరమైన సమయాల్లో భార్యలు వాటిని సాల్వ్ చేసుకోలేని స్థితికి వెళ్లిపోతారని చెప్పుకొచ్చారు.

మాములుగా ఖాళీ సమయాలల్లో అయితే భార్య అడగడం భర్తలకి పెద్దగా ఇబ్బంది అనిపించదు.కానీ ఆఫీస్ పనుల్లో ఉన్నప్పుడు , లేక ఇంపార్టెంట్ మీటింగ్స్ లో ఉన్నప్పుడు కూడా ఇలాగే పర్మిషన్ పేరిట అడగడం అంటే అతన్ని చిరాకు పెట్టించడమే.దీంతో భార్యపై కోప్పడటం , లేదా కోపంతో అసలు మాట్లాడకపోవడం వంటివి చేస్తుంటారు.ఇక ఇలాగే ప్రతీదానికల్లా అడుగుతూ పోతూ ఉంటె సొంత ఇడెంటిటీ అనేది ఒకటుంటుంది అనే విషయం కూడా భార్యలు మర్చిపోవాల్సిందే. ఇక ఏదైనా గోల్ ఉంటె మాత్రం వాటిని నెరవేర్చుకోవడం అనేది కలే.

Advertisement

సో …ఎక్స్పర్ట్స్ చేవుతున్న దాని ప్రకారం చీటికి మాటికి ,ఉన్న దానికి లేని దానికి భర్త పర్మిషన్ తీసుకోవాలన్న ఆలోచనని పక్కన పడేసి సొంతంగా ఆలోచించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు ఒక సూపర్ ఉమెన్ లా తీర్చుకోవడం పక్కా.కావాల్సిందల్లా అన్నింటికీ భర్తపై ఆధారపడటం తగ్గించడమే.సో ఇప్పటికైనా మీకు మీరు థాట్ ప్రాసెస్ ని ఇంప్రూ చేసుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకుంటే అది మీ భర్తకి కూడా మాంచి ఎనర్జీ ఇస్తుంది అనడంలో సందేహం లేదు.మరి ఇప్పటికైనా అన్నింటికి అడగడం మానేసి అవసరమైన వాటికే పర్మిషన్ అడిగి మిమ్మల్ని మీరు ఇంప్రూ చేసుకుంటారు కదూ !

also read :kona venkat: డబ్బులు వెనకేశావా కోనా ?

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×