E-Paper
Advertisement

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?
Advertisement

Nithiin Career:నితిన్.. ఒకప్పుడు ఈ పేరు చెబితే బాక్సాఫీస్ వద్ద గల్లా పెట్టెలు గలగల లాడేవి ,అలా దిల్’, ‘సై’, ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’, ‘అ ఆ’, ‘భీష్మ’ వరుస విజయాలతో తనకంటూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు .కానీ గత కొంతకాలంగా మాత్రం నితిన్‌కు సరైన సక్సెస్ ఒక్కటీ దొరకట్లేదు..

‘భీష్మ’ తర్వాత సీన్ మారిపోయిందా?

Advertisement

నితిన్ కెరీర్‌లో చివరిగా చెప్పుకునే కమర్షియల్ సక్సెస్‌ ఏదంటే వినిపించే పేరు ‘భీష్మ’ .వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కామెడీ, లవ్, ఎంటర్‌టైన్మెంట్ జానర్ లో వచ్చి ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఆ సినిమా తర్వాత నితిన్ ఎన్ని ప్రయోగాలు చేసినా అన్నీ బోల్తా కొట్టినవే . చెక్’, ‘రంగ్ దే’, ‘మాస్ట్రో’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కో జానర్‌లో ట్రై చేసినప్పటికీ ఏ సినిమా కూడా ‘భీష్మ’లాంటి సక్సెస్ ని అందించ లేకపోయింది.దీంతో నితిన్ కెరీర్ కి మాంచి కమర్షియల్ హిట్ ఏ సినిమా ఇస్తుందా అన్న డిస్కషన్ మొదలైపోయింది.

Advertisement

ఆలియాస్ రుక్మిణి సినిమాపై భారీ ఆశలే

ఈ క్రమంలో ప్రస్తుతం మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం లో వస్తున్న ఆలియాస్ రుక్మిణి సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు నితిన్.ఈ సినిమాను నాని సిస్టర్ దీప్తి గంట నిర్మిస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇక ఈ మధ్య రిలీజ్ అయినా గ్లింప్స్‌లో నితిన్‌ను కృష్ణ అనే మ్యాథమెటిక్స్ టీచర్‌గా చూపించడం,. అతని భార్య రుక్మిణి చుట్టూ కథ తిరిగేలా ఈ గ్లింప్స్ ఉండటంతో నితిన్ ఈసారి హిట్ పై గురిపెట్టినట్టే కనిపిస్తుంది.ఇక ఈ ఏడు డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సినిమా ప్రస్తుతం జోరుగా షూటింగ్ చేసుకుంటుందని తెలుస్తుంది.

రితికా నాయక్‌తో మరో సినిమా

ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ మరో కొత్త సినిమా చేస్తున్నాడు కూడా . నారి సిరిసావాడ, సోమశేఖర్ టీ కలిసి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండటం తో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

ఒక మంచి సినిమా పడితే నితిన్ మళ్లీ తన పాత ట్రాక్‌లోకి రావడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఎందుకంటే అతని కెరీర్‌లో ఇలాంటి కమ్‌బ్యాక్‌లు చాలా చూశాం కూడా.
మరి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కి ఆ హిట్ ని ఆలియాస్ రుక్మిణి అందిస్తుందా లేక కొత్త కుర్రాళ్ళ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అందిస్తుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి !

ALSO READ:హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×