Big Tv Kissik Talks: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి (Surekha Vani)కుమార్తె సుప్రీత (Supritha)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈమె వెండితెర సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు .ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న సుప్రీత తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik talks) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా వర్షా ప్రశ్నిస్తూ నువ్వు అమ్మ ఎప్పుడైనా బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయా?అంటూ ప్రశ్న వేశారు ఈ ప్రశ్నకు సుప్రీత సమాధానం చెబుతూ.. సోషల్ మీడియా వేదికగా అమ్మను నన్ను చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు ఆ సమయంలో చాలా బాధపడ్డాము. ఇక డ్రగ్స్ కేసు(Drugs Case)వ్యవహారంలో భాగంగా మా పేర్లను ప్రస్తావించడం తట్టుకోలేకపోయామని సుప్రీత తెలిపారు. కొంతమంది మీడియా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే మా పై డ్రగ్స్ కేసు ఆరోపణలు చేస్తూ తప్పుడు వార్తలు రాసారని, ఆ సమయంలో మేము ఏడవని రోజు లేదు అంటూ ఈమె ఈ సందర్భంగా ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇలా డ్రగ్స్ కేసులో భాగంగా తమ పేర్లను ప్రస్తావించడంతో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు వాటిని చూసి మేము మౌనంతో ఉండిపోయాము. అయితే ఇలాగే ఉంటే మనం ముందుకు వెళ్లలేమని భావించి మౌనం వీడామని సుప్రీత తెలిపారు. మన గురించి రాసే వాళ్ళు ఎలాగైనా రాసుకొని పట్టించుకోకూడదని నిర్ణయం తీసుకున్నామని సుప్రీత తెలిపారు. అయితే ఆ సమయంలో మా గురించి ఇలాంటి ఆరోపణలు చేయడంతో తాము ఎంత బాధపడ్డాము అనే విషయాలను ఎవరు గమనించలేదని సుప్రీత తెలిపారు.
ఇలా డ్రగ్స్ కేసు వ్యవహారంలో భాగంగా సురేఖ వాణి సుప్రీత పేర్లను ప్రస్తావించడం గురించి తాజాగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . గత రెండు సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయంలో పలువురు సెలబ్రిటీలు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోని నిర్మాత కె.పి చౌదరి కూడా ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే కేపీ చౌదరి సురేఖవాణి సుప్రీతకు బాగా పరిచయమైన నేపథ్యంలో ఈ డ్రగ్స్ కేసులో భాగంగా వీరికి కూడా ప్రమేయం ఉంది అంటూ అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదని వీరిద్దరూ ఖండించినప్పటికీ మీడియా వారు తమని ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని గతంలో సురేఖ వాణి తెలిపారు. ఇక తాజాగా సుప్రీత కూడా మీడియా వారు టార్గెట్ చేశారని తప్పుడు వార్తలు రాశారు అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read:కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!